పరగడుపున బెల్లం ఇలా తింటే ఏ జబ్బులు రావు?

Purushottham Vinay
బెల్లం మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. అందుకే ఇంట్లో చక్కరకు బదులుగా బెల్లాన్ని వాడితే ఖచ్చితంగా మనం చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు  చెబుతూ ఉంటారు. ఎందుకంటే బెల్లంలో మన శరీరానికి అవసరమయ్యే చాలా పోషకాలు ఉంటాయి. మన తాత ముత్తాతలు బెల్లాన్నే ఎక్కువగా ఉపయోగించే వారు. అందుకే వారు అప్పట్లో అంత దృఢంగా ఉండే వారు. ప్రతి రోజూ కూడా ఉదయం పరగడుపున ఒక చిన్న బెల్లం ముక్కను తిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల మనం ఈజీగా మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.ప్రతి రోజూ ఉదయం పూట పరగడుపున చిన్న నిమ్మకాయంత బెల్లాన్ని తినడం వల్ల రక్తం బాగా శుద్ధి అవుతుంది. మన రక్తంలో మలినాలు ఎక్కువగా ఉండడం వల్ల మన శరీరంలో దాదాపు 150 రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే బెల్లాన్ని తినడం వల్ల రక్తంలోని మలినాలు విష వ్యర్థ పదార్థాలు ఈజీగా తొలగిపోతాయి. దీంతో మనం షుగర్, రక్తపోటు, థైరాయిడ్, చర్మంపై మొటిమలు ఇంకా అలాగే మచ్చలు వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. చర్మం కూడా చాలా కాంతివంతంగా తయారవుతుంది.


ఇంకా వృద్ధాప్య ఛాయలు అనేవి మన దరి చేరకుండా ఉంటాయి.ప్రతి రోజూ ఉదయం పూట పరగడుపున బెల్లం ముక్క తినడం వల్ల శరీరంలో మెటాబాలిజం రేటు కూడా పెరుగుతుంది.జీర్ణవ్యవస్థ బాగా మెరుగుపడుతుంది. దీంతో మనం తీసుకునే ఆహారంలో ఉండే పోషకాలు మన శరీరానికి సరిగ్గా అందుతాయి. ఇంకా అంతేకాకుండా మలబద్దకం వంటి సమస్యలు కూడా చాలా సులభంగా తగ్గుతాయి. అలాగే బెల్లాన్ని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్యలు కూడా ఈజీగా తగ్గుతాయి. ఇంకా అంతేకాకుండా శరీరానికి కావాల్సిన క్యాల్షియం లభిస్తుంది. దీంతో బోన్స్ గట్టిగా మారతాయి. అలాగే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలు కూడా ఈజీగా తగ్గుతాయి.ఇంకా అంతేకాకుండా రోజూ బెల్లాన్ని తీసుకోవడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. అలాగే నాడీ మండల వ్యవస్థ కూడా చాలా చక్కగా పని చేస్తుంది. శరీరంలో వేడి అదుపులో ఉంటుంది. ఈ విధంగా బెల్లం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిని తినడం వల్ల మనం చాలా అనారోగ్య సమస్యలను చాలా ఈజీగా దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: