పచ్చిబఠానీలు అధికంగా తీసుకుంటే అంతే సంగతులు..!

Divya
పచ్చి బఠానీలు శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.వీటిని పేదవాడి మటన్ అని కూడా అనవచ్చు. ఎందుకంటే మటన్ లో ఉండే పోషకాలాన్ని పచ్చి బఠానీలు లభిస్తాయి.అందులోను ఇవి తినడానికి రుచికరంగా ఉంటాయి.చాలామంది వీటిని కూరలోనూ, రైస్ లోను త‌ర‌చూ వాడుతూనే ఉంటారు.ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ పుష్కళంగా ఉంటాయి. డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ప‌చ్చి బ‌ఠానీలు షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. ఇందులో ముఖ్యంగా ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం అవడానికి సహాయపడుతుంది. ఇన్ని పోషకాలు ఉన్నాయని పచ్చి బఠానిలను అధికంగా తీసుకోకూడదు.వీటిని ఎక్కువగా తీసుకుంటే ఎన్నో దుస్ప్రభావాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ప‌చ్చి బ‌ఠానీల్లో లెక్టిన్‌, ఫైటిక్ అనే న్యూట్రియాంట్లు అధికంగా ఉంటాయి. ఇవి పొట్టలో అధికంగా చేరితే గ్యాస్‌, క‌డుపుఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటుంది. అంతేకాక వీటిని అధికంగా తీసుకోవడం వల్ల  శ‌రీరంలో ఉన్న కాల్షియం యూరిక్ యాసిడ్ తో కలిసి బయటకు వెళ్ళిపోతుంది. దీని వల్ల ఎముకలు బలహీనంగా తయారవుతాయి. ప‌చ్చి బ‌ఠానీల‌ను ఎక్కువగా తినడం వల్ల యూరిక్ ఆమ్లం అధికంగా ఊత్పత్తి అయి కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం వుంది.క‌నుక వీటిని మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది.

ప‌చ్చి బ‌ఠానీల్లో కార్బొహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి జీర్ణం అవడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి.వీటిని అధిక మొత్తంలో తీసుకుంటే కడుపు ఉబ్బరం,అజీర్ణం, విరేచ‌నాలు వంటి స‌మ‌స్య‌లు చుట్టూముడతాయి. ఇక కార్బోహైడ్రైట్స్ అధికంగా తీసుకోవడం వ‌ల్ల బ‌రువు తొందరగా పెరిగే అవకాశాలు ఉంటాయి.చెడు కొలెస్ట్రాల్ అధిక మొత్తంలో పేరుకుపోవడం వల్ల,షుగ‌ర్ లెవ‌ల్స్ పెరగడం, గుండె సంబంధిత సమస్యలు అధికమవ్వడం వంటివి జరుగుతాయి.వీటిని అధికంగా తీసుకోవడం వల్ల మూత్రపిండ సమస్యలు అధికమవుతాయి. కాబట్టి రోజుకు 100 గ్రాములు క‌న్నా ఎక్కువ మోతాదులో ప‌చ్చి బ‌ఠానీల‌ను తీసుకోకూడదని ఆహార నిపుణులు హెచ్చరిస్తుంటారు. కావున వీటిని మొత్తాదులో తింటేనే ఆరోగ్యానికిమంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: