టీ, కాఫీలు ఎప్పుడు పడితే అప్పుడు తాగితే కలిగే నష్టాలు?

Purushottham Vinay
నేటి కాలంలో ఈ ఉరుకులు పరుగుల జీవితంలో కొన్ని అనారోగ్యపు ఆహారపు అలవాట్లను ఇంకా అలాగే జీవన విధానాలను పాటిస్తూ అనేక రోగాలు తెచ్చుకుంటున్నాము.అయితే అలాంటి ఆహారపు అలవాట్లలో మొదటగా మనం ఎక్కువ అలవాటు చేసుకుంది టీ లేదా కాఫీ తాగడం. మనలో చాలా మందికి పొద్దున నుంచి రాత్రి పడుకునే వరకు భోజనం కంటే టీ, కాఫీలనే ఎక్కువగా తాగే అలవాటు ఉంటుంది. అసలు ఈ అలవాటు ఉన్న వారికి కాలంతో, సమయంతో సంబంధం ఉండదు. తమలోని బద్దకాన్ని, టెన్షన్స్‌ను తరిమికొట్టేందుకు టీ, కాఫీలనే ఎక్కువగా తాగుతూ ఉంటారు.అయితే టీ ఎక్కువగా తాగడం వల్ల ఖచ్చితంగా చాలా రకాల సమస్యలు ఎదురవుతాయి.ముఖ్యంగా ఏమైన తిన్న తర్వాత టీ తాగడం మన ఆరోగ్యానికి ఖచ్చితంగా హానీ కలిగిస్తుంది.అయితే మరీ ఎక్కువ తాగకుండా రోజుకు రెండు కప్పుల టీ తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎటువంటి నష్టం లేదు.టీ, కాఫీలు తాగడానికి కూడా సమయం, సందర్భాలను ఖచ్చితంగా చూసుకోవాలి.


పొద్దున పూట అల్పాహారంతో పాటుగా చాలా మంది కూడా కాఫీ లేదా టీ తాగుతుంటారు. ఇంకా అలాగే సాయంత్రం కూడా స్నాక్స్‌తో టీని తాగుతారు. అలా టీ తాగడం వల్ల మన ఆరోగ్యంకి ఏమి కాదు. కానీ పొద్దున తిన్న తర్వాత లేదా రాత్రి భోజనం చేసిన తర్వాత టీ తాగడం అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదు. ఎక్కువగా టీ తాగడం వల్ల ఖచ్చితంగా తీవ్రమైన అనారోగ్యాలు వస్తాయి.  భోజనం చేసిన తర్వాత టీ తాగితే శరీరంలో రక్తహీనత ఏర్పడుతుంది. పొద్దున్నే ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల గ్యాస్ ఇంకా పొట్ట సమస్యలు  వస్తాయి. భోజనానికి ముందు, తర్వాత టీ తాగడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అలా చేస్తే తీవ్ర ఆనారోగ్యానికి గురవుతారు.ఎక్కువగా టీ తాగడం వల్ల కార్టిసాల్ లేదా స్టెరాయిడ్ హార్మోన్ స్థాయి పెరిగి, ఆరోగ్య సమస్యలను తీవ్రంగా పెంచుతుంది. అలాగే చాలా మంది కూడా రాత్రిపూట నిద్రలేమితో బాధపడడానికి కూడా టీ ఎక్కువగా తాగడమే కారణం. కాబట్టి మీకు తలనొప్పిగా ఉన్నప్పుడు లేదా టెన్షన్స్‌ నుంచి రిలీఫ్ కోసం మాత్రమే అది కూడా రోజుకు రెండు నుంచి మూడు సార్లే టీ లేదా కాఫీలను తాగండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: