బరువు తగ్గాలనుకునేవారు నైట్ ఇలా చెయ్యండి?

Purushottham Vinay
అధిక బరువు తగ్గడానికి ఉపయోగపడే చిట్కాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అధిక బరువు సమస్యతో బాధపడే వారు భోజనంలో అన్నానికి బదులుగా రెండు పుల్కాలను తీసుకోవాలి.గోధుమ పిండి, జొన్న పిండి ఇంకా అలాగే రాగిపిండి లేదా మల్టీ గ్రెయిన్ పిండితో చేసిన పుల్కాలను వారు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఒక గ్లాస్ బియ్యంతో వండిన అన్నాన్ని తినడం వల్ల వారికి 500 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఇక పుల్కాలను తినడం వల్ల 140 నుండి150 గ్రాముల శక్తి అనేది లభిస్తుంది. త్వరగా బరువు తగ్గాలనుకునే వారు ముందుగా అన్నం తీసుకోవడం మానేయాలి.వారు రెండు పుల్కాలను తినడం వల్ల కడుపు నిండిన భావన వారికి కలగదు. అయితే ఈ పుల్కాలను ఎక్కువ కూరతో తినాలి.ఆకుకూరలు ఇంకా కూరగాయల్లో సహజంగా చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఈ కూరగాయల్లో మనం నూనె ఇంకా ఉప్పు ఎక్కువగా వేసి కూరలు చేస్తూ ఉంటాం.దీంతో అవి ఎక్కువ క్యాలరీలు కలిగిన ఆహారాలుగా మారిపోతున్నాయి.అలాగే ఉప్పు, నూనెను  తక్కువగా ఉపయోగిస్తే మన శరీరానికి చాలా మంచిది. కాబట్టి ఉప్పు, నూనె తక్కువగా వేసి చేసిన కూరలను పుల్కాలతో కలిపి ఎక్కువగా తీసుకోవాలి. ఇక  అర కిలో కూరలను తిన్నా కూడా మన శరీరానికి దాదాపు 150 కంటే తక్కువ క్యాలరీలు మాత్రమే మీకు లభిస్తాయి.


కూరగాయలను ఇంకా అలాగే ఆకుకూరలను ఎక్కవగా తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలగడంతో పాటు క్యాలరీలు కూడా శరీరానికి తక్కువగా అందుతాయి. అలాగే దీంతో మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా ఈజీగా కరుగుతుంది.ఇంకా అలాగే బరువు తగ్గాలనుకునే వారు సాయంత్రం పూట భోజనంలో కేవలం పండ్లను మాత్రమే తీసుకోవాలి.ఈ పండ్లను తీసుకోవడం వల్ల 400 క్యాలరీలు లభిస్తాయి.అయితే ఈ పండ్లను కూడా సాయంత్రం 7 గంటల లోపు తీసుకోవాలి.  అందువల్ల రాత్రి నుండి ఉదయం వరకు కావల్సిన శక్తిని శరీరం పేరుకుపోయిన కొవ్వు నుండి సేకరిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ విధంగా సాయంత్రం పూట పండ్లను తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందవచ్చు.ఇంకా అలాగే అధిక బరువుతో బాధపడే వారు ఉదయం పూట అల్పాహారంగా రెండు లేదా మూడు రకాల మొలకెత్తిన విత్తనాలను ఇంకా అలాగే పండ్లను తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభించడంతో పాటు మంచి పోషకాలు కూడా అందుతాయి. అలాగే నీరసం రాకుండా ఉంటుంది. రోజంతా కూడా ఉత్సాహంగా ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: