పరగడుపున టమాట తింటే కలిగే లాభాలు?

Purushottham Vinay
మనం కూరల్లో వండుకొని తినే టొమాటో ఎంత రుచిగా ఉంటుందో, ఆరోగ్యానికి కూడా అదే విధంగా మేలు చేస్తుంది. అందుకే మీరు దీన్ని సలాడ్‌లు ఇంకా చట్నీల రూపంలో తినవచ్చు, అయితే ఉదయం పూట ఖాళీ కడుపుతో టమోటాలు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. టమోటాలో పోషకాలకు అసలు ఏమాత్రం లోటు లేదు. దీనిని ప్రతి రోజూ కూడా ఆహారంలో చేర్చుకుంటే శరీరానికి ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్ ఇంకా అలాగే సహజ చక్కెర, పీచు, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, ఐరన్, ఫాస్పరస్, విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ సి, విటమిన్ బి6 ఇంకా రిబోఫ్లావిన్ వంటి పోషకాలు అందుతాయి. ఇవి ఆరోగ్యంగా ఉంచడంతో పాటు పలు అనారోగ్య సమస్యల నుంచి కూడా మిమ్మల్ని రక్షణ కల్పిస్తాయి. మరి టమోటాలు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.కడుపులో నులిపురుగుల సమస్య అనేది సాధారణ సమస్య.ఇది శరీరానికి చాలా రకాలుగా హాని కలిగిస్తుంది. కాబట్టి చాలా మంది ఆరోగ్య నిపుణులు ఉదయం పూట ఖాళీ కడుపుతో టమోటాలను నల్ల మిరియాల పొడితో తినాలని సిఫార్సు చేస్తున్నారు.


ఇలా చేయడం వల్ల శరీరంలోని నులిపురుగులు చాలా ఈజీగా చనిపోతాయి. కొంతమంది తరచుగా గుండెల్లో మంటతో బాధ పడుతూ ఉంటారు. ఇక దీని కారణంగా, చర్మంపై దద్దుర్లు కూడా ఎక్కువగా కనిపిస్తాయి, అటువంటి పరిస్థితిలో, మీరు ఉదయం పూట ఖాళీ కడుపుతో టమోటాలు తినాలి, తద్వారా ఉపశమనం పొందవచ్చు. ఇండియాలో గుండె జబ్బులతో బాధపడుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.ఇక ఇందులో  అధిక కొలెస్ట్రాల్ కారణంగా రక్త నాళాలు నిరోధించబడటం ప్రారంభిస్తాయి.వీరు టమోటా లేదా దాని రసం కనుక తీసుకుంటే, అది గుండెపోటు ఇంకా అలాగే స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కంటిచూపు తక్కువున్న వారికి కూడా ఈ టమోటా అనేది చాలా మంచి ఆహారం. ఎందుకంటే ఈ కూరగాయలలో విటమిన్-ఎ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. అందుకే వీటిని ఎక్కువగా ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే టమోటా రసం, పచ్చడి, సలాడ్లు ఇంకా సూప్‌లను బాగా తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: