గసగసాలు: ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు ?

Purushottham Vinay
గసగసాలు: గసగసాలు ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు ఇస్తాయి.గసగసాలు ఆరోగ్యానికి చాలా మంచివి.వీటిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఔషధంగా ఉపయోగిస్తున్నారు.గసగసాల్లో మన శరీరానికి అవసరమయ్యే చాలా పోషకాలు ఉన్నాయి. గసగసాలను ప్రతిరోజూ కూడా మీరు తగిన మోతాదులో తీసుకుంటే ఖచ్చితంగా చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.ఈ గసగసాలను తీసుకోవడం వల్ల శరీరానికి మంచిగా చలువ చేస్తుంది. కడుపులో అల్సర్లు వంటి సమస్యలు చాలా ఈజీగా తగ్గుతాయి. ఎక్కువ దాహం వేసే సమస్య కూడా తగ్గుతుంది. ఇంకా అలాగే గసగసాలను తీసుకోవడం వల్ల పిత, కఫ, వాత దోషాలు కూడా చాలా ఈజీగా తొలగిపోతాయి. గసగసాలను  పాలల్లో మరిగించి తీసుకోవడం వల్ల మేహ జ్వరాలు, వాంతులు, విరోచనాలు చాలా ఈజీగా తగ్గు ముఖం పడతాయి. 


ఇంకా అలాగే ఫైల్స్ సమస్యతో బాధపడే వారు గసగసాలను ఇలా పాలతో కలిపి తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. దగ్గు, ఉబ్బసం, క్షయ ఇంకా అలాగే షుగర్ వంటి వాధ్యులతో బాధపడే వారు ఈ గసగసాలను తీసుకోవడం వల్ల ఆ సమస్యల నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు. అలాగే ఈ గసగసాలను తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లనేవి ఏర్పడకుండా ఉంటాయి.ఇంకా అలాగే గుండె సమస్యలతో ఎక్కువగా బాధపడే వారు రోజుకు రెండు పూటలా వేయించిన గసగసాలను రెండు టీ స్పూన్ల మోతాదులో తీసుకోవడం వల్ల గుండె చాలా బలంగా తయారవుతుంది.ఇంకా అలాగే మానసిక సమస్యలతో భాదపడే వారు అధిక ఒత్తిడి ఇంకా ఆందోళన వంటి సమస్యలతో బాధపడే వారు గసగసాలను పాలల్లో కలిపి తీసుకోవడం వల్ల ఖచ్చితంగా సమస్యలు తగ్గిపోతాయి.ఇలా గసగసాలు మనకు చాలా ఉపయోగపడతాయని వాటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: