పానిపూరిని వర్షాకాలంలో ఎక్కువగా తింటున్నారా? ఆ ముప్పు తప్పదు..

Satvika
పానీపూరి అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు.. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తింటారు..కాలం ఏదైనా పానిపూరి లవర్స్ మాత్రం తినకుండా ఉండరు.. తక్కువ ధరతో రుచి అమొహమ్ అంటారు.. మధ్యాహ్నం నుంచే అందరు బండి ఎప్పుడూ వస్తుందా అని ఎదురు చూస్తున్నారంటే నమ్మాలి.వీధి చివర పానీపూరి బండి దగ్గర జనం గుమికూడి ఉంటారు.రోడ్ల పక్కన కనిపించే ప్రతిదీ తినకూడదు.. వీటిని తింటే ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయని మనందరికీ తెలుసు. కానీ ఎందుకో అందరం వెళ్లి వాటినే తినడానికి ఇష్టపడతాం..

కానీ పానీ పూరీ, గోల్గప్పలను ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలం సీజన్‌లో వీటిని తింటే టైఫాయిడ్, ఇంకా అనేక ఇతర సమస్యలకు దారితీస్తుందిన ఆరోగ్య నిపుణులు అంటున్నారు..ఈ ఏడాదిలో తెలంగాణలో సుమారు 27,00 టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో, జూన్ నెలలో 2752 కేసులు నమోదయ్యాయి. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీనివాస్ టైఫాయిడ్‌కు ''పానీ పూరీ డిసీజ్'' అని పేరు పెట్టారు. పానీ పూరీ వల్ల టైఫాయిడ్ వచ్చే ప్రమాదం ఉండటమే కాకుండా అనేక ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు పేర్కొన్నారు..

పానీపూరి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు..

వీటిని అధికంగా తీసుకోవడం వల్ల విరేచనాలు వచ్చే ప్రమాదం ఉంది.
మీ పిల్లలు ఎక్కువ గొల్గప్పలను తీసుకుంటే అది డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది.
గొల్లకాయలు ఎక్కువగా తింటే వాంతులు, విరేచనాలు, కామెర్లు వచ్చే అవకాశం ఉంది.
పానీ పూరీ వల్ల అల్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
పానీ పూరీని ఎక్కువగా తినడం వల్ల జీర్ణక్రియలో ఆటంకాలు ఏర్పడతాయి.
పానీపూరి ప్రేగులలో మంటకు కూడా కారణం కావచ్చు.
తక్కువ కదా అని కక్కుర్తి పడ్డారో కొని మరీ అనారొగ్య సమస్యలను తెచ్చుకున్న వారు అవుతారు..ఈ వర్షాకాలం లో దాని జోలికి వెళ్ళక పోవడమే మంచిది.టెంప్ట్ అయ్యారో ఇక అంతే..ప్రాణాలు పోయినా పోతాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: