కీళ్ళ నొప్పుల సమస్య ఈజీగా తగ్గే సింపుల్ టిప్?

Purushottham Vinay
మన ఇంట్లో ఉండే శొంఠి పొడి ఇంకా పసుపును ఉపయోగించి మనం కీళ్ల నొప్పుల సమస్య నుండి చాలా ఈజీగా రిలీఫ్ పొందవచ్చు. శొంఠిపొడిలో, పసుపులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి.వీటిలో ఉండే యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు మన శరీరంలో ఉండే నొప్పులను ఇంకా వాపులను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి. మన రోజువారి ఆహారంలో ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గడంతో పాటు మనం చాలా చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. కీళ్ల నొప్పులను తగ్గించడానికి పసుపును ఇంకా అలాగే శొంఠి పొడిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందు కోసం ముందుగా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి. తరువాత ఈ నీటిలో అర టీ స్పూన్ పసుపును ఇంకా అలాగే పావు టీ స్పూన్ శొంఠి పొడిని వేసి బాగా కలపాలి. ఇక ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని ప్రతి రోజూ కూడా ఉదయం పూట పరగడుపున తాగాలి. ఈ పానీయం మన శరీరానికి మంచి పెయిన్ కిల్లర్ లా పని చేస్తుంది. ఈ పానీయాన్ని తాగడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా చాలా ఈజీగా పొందవచ్చు.


పసుపు, శొంఠి పొడి కలిపిన పానీయాన్ని క్రమం తప్పకుండ నెలరోజుల పాటు తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలు చాలా ఈజీగా తగ్గుతాయి. ఈ టిప్ పాటిస్తూనే కీళ్ల నొప్పులకు కారణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవడం కూడా మానివేయాలి.ముఖ్యంగా జంక్ ఫుడ్ ను, రెడ్ మీట్ ను, ఆర్టిఫిషియల్ చక్కెరలకు, ప్రాసెస్ట్ ఫుడ్ కు, ఆల్కహాల్ కు ఖచ్చితంగా చాలా దూరంగా ఉండాలి. ఈ పదార్థాలు బరువును పెంచడంతో పాటు శరీరంలో నొప్పులకు కూడా చాలా ఈజీగా దారి తీస్తాయి. ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉంటూనే క్యాల్షియం ఇంకా అలాగే మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఈ విధంగా ఈ టిప్స్ పాటించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: