అసిడీటీని తగ్గించే సింపుల్ టిప్స్?

Purushottham Vinay
తిన్న తర్వాత చాలా మందికి కూడా గుండెల్లో బాగా మంట వస్తుంది. మీరు లైట్ గా లేదా హెవీగా ఏదైనా తిన్నప్పుడు, మీ ఛాతీలో లేదా కడుపులో ఈ మంట ప్రారంభమవుతుంది. ఈ మంటని తగ్గించేందుకు కొన్ని టిప్స్ వున్నాయి. అవేంటో తెలుసుకొని వాటిని పాటించండి.నిమ్మకాయల్లో విటమిన్-సి అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియలో చాలా బాగా సహాయపడుతుంది. దీన్ని తిన్న తర్వాత ఒక కప్పు నీటిలో నిమ్మరసం ఇంకా అలాగే నల్ల ఉప్పును కలిపి తాగాలి. ఇది గుండెల్లో మంట నుండి బయటపడటానికి చాలా ఈజీగా సహాయపడుతుంది.ఇంకా అలాగే కలబంద రసం తాగడం వల్ల కడుపులో చికాకు నుండి ఖచ్చితంగా ఉపశమనం పొందవచ్చు. ఇవి మెడికల్ స్టోర్లలో చాలా సులభంగా దొరుకుతాయి. మీకు కావాలంటే మీరు తినవచ్చు కూడా. ఇది కడుపులోని ఆమ్లతను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది.ఇంకా అలాగే గుండెల్లో మంట సమస్య నుండి బయటపడటానికి భోజనం తర్వాత బెల్లం తినటం అలవాటు చేసుకోవాలి.. ఇది జీర్ణ శక్తిని బాగా బలోపేతం చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది.ఇంకా అరటిపండులో పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు నొప్పిని తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.. అరటిపండును భోజనం చేసిన తర్వాత క్రమం తప్పకుండా తినవచ్చు.


సొంపు అనేది సహజమైన మౌత్ ఫ్రెషనర్. ఇది కడుపులోని గ్యాస్‌ నుంచి ఉపశమనం పొందేందుకు కూడా బాగా పనిచేస్తుంది. మీరు ఆహారం తిన్న తర్వాత ప్రతిరోజూ కూడా ఖచ్చితంగా కొంచం సోంపును తీసుకోవచ్చు. ఇది మీకు గుండెల్లో మంట సమస్య నుండి ఈజీగా ఉపశమనం ఇస్తుంది. మీకు కావాలంటే, మీరు ఒక గ్లాసు నీటిలో ఈ సోంపును రాత్రంతా కూడా నానబెట్టుకుని… దీన్ని వడగట్టి ఉదయాన్నే నీళ్లు తాగితే కడుపులో మంట చాలా ఈజీగా తగ్గుతుంది.ఇంకా అల్లం కూడా ఎసిడిటీని తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుంది.అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది. అల్లం ముక్కను నమలడం వల్ల ఎసిడిటీ నుంచి ఖచ్చితంగా ఉపశమనం పొందవచ్చు. కావాలంటే దీన్ని నీళ్లలో వేసి మరిగించుని వడగట్టుకోవచ్చు. అయితే నీరు వెచ్చగా ఉన్నప్పుడే మీరు దానిని తాగేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: