ఈ అలవాట్లు ఎముకల బలహీనతకు కారణం?

Purushottham Vinay
మన శరీరం ఫిట్‌గా ఉండాలంటే మనం చాలా బలంగా ఉండాలి. బలంగా ఉండాలంటే ఎముకలు చాలా దృఢంగా ఉండాలి. కానీ మారిన జీవనశైలి ఇంకా అలాగే చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎముకలు చాలా బలహీనంగా మారుతాయి.మనం తినే కొన్ని ఆహార పదార్ధాలు మన బాడీ నుంచి కాల్షియాన్ని చాలా ఈజీగా బయటికి పంపిస్తాయి. ఇవి ఎంత తక్కువ తీసుకుంటే అంత ఆరోగ్యానికి చాలా మంచిది. నిజానికి ఎముకల గట్టితనం అనేది మనం తీసుకునే కాల్షియంపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. అయితే బోన్స్‌ వీక్‌కి గల కారణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.మన భారతదేశంలో అయితే టీ, కాఫీ తాగే వారి సంఖ్య చాలా ఎక్కువగా పెరుగుతుంది. మన దేశ ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు టీ, కాఫీని ఎప్పుడూ కూడా తాగుతూనే ఉంటారు. ఈ పానీయాలలో కెఫిన్ పరిమాణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో కాల్షియం అవసరాన్ని బాగా పెంచుతుంది. ఈ అలవాట్ల వల్ల మీరు కాల్షియం చాలా ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.


మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే చాలా హెల్దీగా ఉంటారు. సాధారణంగా ప్రేమ విఫలమవడం, స్నేహంలో మోసం చేయడం, డబ్బు లేకపోవడం, ఆఫీసులో సమస్యలు ఇంకా అలాగే చాలా తీవ్రమైన అనారోగ్యం వంటి కారణాల వల్ల చాలామంది తీవ్ర ఒత్తిడికి ఎక్కువగా లోనవుతారు. దీనివల్ల ఎముకలు చాలా పెళుసుగా మారుతాయి. ఎందుకంటే ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్‌ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇక దీని కారణంగా శరీరం నుంచి కాల్షియం బయటికి ఈజీగా వెళ్లిపోతుంది. దీంతో ఎముకలు చాలా బలహీనంగా మారుతాయి.ప్రస్తుత కాలంలో కూల్‌ డ్రింక్స్‌ ఇంకా అలాగే కార్బోనేటేడ్ పానీయాల వినియోగం అనేది చాలా బాగా పెరిగింది. తరచుగా మనం పెళ్లిళ్లు ఇంకా అలాగే పార్టీలు లేదా రోజువారీ జీవితంలో వాటిని పెద్ద మొత్తంలో తాగుతున్నాం. ఈ పానీయాలలో ఫాస్ఫేట్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఇది మన శరీరం నుంచి కాల్షియంను తగ్గిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: