ఆస్తమా: సింపుల్ గా తగ్గే హోమ్ టిప్?

Purushottham Vinay
ఆస్తమా ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. దీని బారిన పడడానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. ఆస్థమా ఉన్న వారు ధూమపానానికి, దుమ్ము ఇంకా అలాగే ధూళికి చాలా దూరంగా ఉండాలి. శీతల పానీయాలు, ఐస్ క్రీమ్స్, చల్లటి నీరు వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇంట్లో బూజు దులపడం, వర్షంలో తడవడం, ఎక్కువ సేపు ఈత కొట్టడం చేయకూడదు. కొన్ని హోమ్ టిప్స్  ద్వారా మనం ఆస్థమాను తగ్గించుకోవచ్చు. తేనె, నిమ్మరసం మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల మనం ఆస్థమాను తగ్గించుకోవచ్చు. ఆస్థమాను తగ్గించే సాధారణ గృహ నివారిణిగా తేనెను పేర్కొనవచ్చు. తేనె శ్వాస మార్గాలను శుభ్రపరుస్తుంది. అలాగే నిమ్మరసాన్ని తీసుకోవడం వల్ల ఆస్థమా వ్యాధి తీవ్రత తగ్గుతుంది.ఇవి రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల మనం చక్కటి ఫలితాలను పొందవచ్చు. అలాగే ఆస్థమాను తగ్గించడంలో కాకరకాయ తీగ వేరు ఎంతగానో పని చేస్తుంది. ఈ వేరును సేకరించి శుభ్రపరిచి పేస్ట్ గా చేసుకోవాలి. తరువాత దీనికి అంతే మొత్తంలో తేనెను కానీ తులసి ఆకుల రసాన్ని కలిపి రాత్రి పూట సేవించాలి. నెలరోజుల పాటు ఇలా చేయడం వల్ల ఆస్థమాను నివారించుకోవచ్చు.


అలాగే అల్లం, మెంతుల కషాయాన్ని తీసుకోవడం వల్ల కూడా ఆస్థమా వ్యాధి నుండి మనం చక్కటి ఉపశమనాన్ని పొందవచ్చు. ఒక కప్పు నీటిలో ఒక ఇంచు అల్లం ముక్క, ఒక టీ స్పూన్ మెంతులు వేసి బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి.ఈ ఔషధం చాలా శక్తివంతమైనది. దీనిని రోజుకు రెండు సార్లు తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. వెల్లుల్లి రెబ్బలు కూడా ఆస్థమాను తగ్గించడంలో మనకు ఎంతగానో దోహదపడతాయి. పది వెల్లుల్లి రెబ్బలను తీసుకుని 30 మిల్లీ లీటర్ల పాలల్లో వేసి మరిగించాలి. అందులో రెండు టీ స్పూన్ల చక్కెరను కూడా వేసి కలపాలి. తరువాత ఈ పాలను వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. దీనిని తీసుకోవడం వల్ల ప్రారంభ దశలో ఉన్న ఆస్థమాను పూర్తిగా తగ్గించవచ్చు. ఆస్థమాను తగ్గించడానికి రోజుకు రెండు సార్లు అల్లం టీ ని తాగాలి. అల్లం టీ ని తాగడం వల్ల కూడా మనం ఆస్థమాను తగ్గించుకోవచ్చు. ఈ జాగ్రత్తలను తీసుకుంటూ పైన తెలపిన చిట్కాలను పాటించడం వల్ల ఆస్థమా వ్యాధి నుండి చాలా ఈజీగా బయటపడొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: