పేలు సమస్య ఈజీగా తగ్గే టిప్స్?

Purushottham Vinay
చాలా మందిని కూడా పేలు సమస్య బాగా వేధిస్తుంది. అయితే సహజ సిద్ద పదార్థాలతో పేల నుండి విముక్తిని పొందవచ్చు. దీని కోసం గుప్పెడు తులసి ఆకులను మెత్తగా నూరి రాత్రి పడుకునే ముందు తలకు అంటేలా బాగా రాసుకోవాలి. తరువాత వెంట్రుకలు కనబడకుండా తలకు టవల్ ను లేదా మరో వస్త్రాన్ని కట్టుకుని పట్టుకోవాలి. ఉదయం లేచిన తరువాత పేల దువ్వెనతో దువ్వుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా పేల బాధ తగ్గుతుంది. అలాగే ఆలివ్ నూనెను తలకు రాసి వెంట్రుకలకు షవర్ క్యాప్ పెట్టుకుని పడుకోవాలి. ఉదయం లేచిన తరువాత పేల దువ్వెనతో దువ్వుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే పేల బాధ నుండి విముక్తి పొందవచ్చు. ఈ చిట్కాను పాటించడం వల్ల పేల బాధ నుండి శాశ్వత పరిష్కారం కలుగుతుంది. ఇంకా అలాగే ఇంకో చిట్కా కూడా ఉంది.ముందుగా ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ ను తీసుకుని అందులో అంతే మోతాదులో నీటిని వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని తలకు రాసి ఆరనివ్వాలి. సరిగ్గా గంట తరువాత కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయాలి.


ఇలా చేయడం వల్ల పేల బాధ నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఒక కప్పు కొబ్బరి నూనెలో ఒక టీ స్పూన్ కర్పూరం బిళ్లలను వేసి కరిగిపోయే వరకు నూనెను వెచ్చబెట్టాలి. ఈ నూనె గోరు వెచ్చగా అయిన తరువాత దానిని తలకు రాసి మాడుకు అంటేలా బాగా మర్దనా చేయాలి. ఒక గంట తరువాత కుంకుడు కాయ రసంతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.వారానికి ఒకసారి ఇలా చేస్తే పేల బాధ నుండి విముక్తి పొందవచ్చు. ఈ చిట్కాలను పాటించడం వల్ల పేల బాధ నుండి శాశ్వత పరిష్కారం కలుగుతుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ సింపుల్ టిప్స్ ని పాటించండి. ఈ సమస్య నుంచి శాశ్వతంగా పరిష్కారం పొందండి. ఈ చిట్కాలు కేవలం పేలు పోవడానికే కాదు జుట్టుకు సంబంధించిన అనేక రకాల సమస్యలు కూడా పోవడానికి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ చిట్కాలను పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: