పసుపు: ఈ టిప్ పాటిస్తే జీవితాంతం ఆరోగ్యమే ఆరోగ్యం?

Purushottham Vinay
పసుపు ఆరోగ్యానికి చాలా మంచిది.వేడి నీటిలో పసుపును కలిపి రోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి.ఇలా పసుపు నీటిని తాగడం వల్ల ప్రేగుల్లో బ్యాక్టీరియా నశిస్తుంది. అలాగే మనం వంటల్లో వాడే మసాలా దినుసుల్లో మిరియాలు ఒకటి. వీటిలో కూడా ఎన్నో ఔషధ గుణాలు అలాగే మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. మిరియాలను ఉపయోగించడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. శరీరంలో కొవ్వు కరుగుతుంది. అంతేకాకుండా వ్యర్థ పదార్థాలు కూడా తొలగిపోతాయి. మిరియాలతో చేసే వంటకాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని, డిప్రెషన్ కూడా తగ్గిస్తాయి. శరీరంలో మంచి కొవ్వు స్థాయిలను పెంచి గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో కూడా మిరియాలు కూడా మనకు సహాయపడతాయి.ఇంకా అలాగే పసుపును, మిరియాల పొడిని కలిపి తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. పసుపులో ఉన్న క్యురుకుమిన్ అలాగే మిరియాల్లో ఉన్న పెప్పరాయిన్ అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. పసుపు శరీరంలో నిల్వ ఉండడం వల్ల శరీరానికి అవసరమయిన ఎంజైమ్ లను ఉత్పత్తి చేస్తుంది. పసుపు, మిరియాలను కలిపి తీసుకోవడం వల్ల నరాలకు శక్తి లభిస్తుంది.


ఎముకలు ధృడంగా తయారవుతాయి.ఇవి రెండు కలిపిన మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల మూత్రాశయంలో రాళ్లు కరిగిపోతాయి. ఒక గిన్నెలో పసుపు, మిరియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమంతో దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాల సమస్యలు, చిగుళ్ల సమస్యలు తగ్గుతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. ఈ విధంగా పసుపు మరియు మిరియాల మిశ్రమం మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని వీటిని ఉపయోగించడం వల్ల దాదాపు అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మనం దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.పసుపులో ఐరన్, క్యాల్షియం, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు జీవక్రియలు సక్రమంగా జరిగేలా చేయడంలో సహాయపడతాయి. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. క్యాన్సర్ కణాలతో పోరాడే లక్షణాలు పసుపులో పుష్కలంగా ఉన్నాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, చక్కటి ఆహార నియమాలను పాటించడంతో పసుపును వంటల్లో వాడడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: