నిమ్మకాయతో షుగర్ కి చెక్.. ఎలా అంటే?

Purushottham Vinay
నిమ్మ రసం మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మన శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో చాలా సహాయపడుతుంది. అయితే నిమ్మకాయ సహాయంతో రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రించవచ్చంటున్నారు అవును ఇది డయాబెటిక్ రోగులకు దివ్యౌషధం లాంటిది. మరి మధుమేహం బాధితులు నిమ్మకాయను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం రండి. మధుమేహ వ్యాధిగ్రస్తులైతే, మీరు ప్రతిసారీ భోజనానికి ముందు నిమ్మరసం తీసుకోవాలి. ఇందుకోసం ఒక గ్లాసు నిమ్మరసంలోకి కాసింత రాళ్ల ఉప్పు కలిపి తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి.ఇక మనం తీసుకునే ఆహారంతో పాటు నిమ్మరసాన్ని తీసుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి ఇది చక్కని మార్గం. రోజూ భోజనంలో నిమ్మకాయ, ఆకుకూరలు, కూరగాయలు, మాంసాహారం లేదా లంచ్, డిన్నర్.. ఇలా ఏ సమయంలో, ఏ కూరతోనైనా నిమ్మరసం తీసుకోవచ్చు. 


చిరుతిళ్లతో నిమ్మరసం మధుమేహ వ్యాధిగ్రస్తులైతే నిమ్మరసం పిండుకుని స్నాక్స్‌లో ముఖ్యంగా వేరుశెనగతో కలిపి తింటే చాలా మేలు జరుగుతుంది.ఈ విధంగా షుగర్ లెవెల్ అదుపులో ఉంటుంది. లెమన్ టీని ఉదయం నుండి సాయంత్రం వరకు డ్రింక్‌తో తాగే వారు మనలో చాలా మంది ఉన్నారు. కానీ మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే మీరు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బ్లాక్ టీ లేదా గ్రీన్ టీలో నిమ్మరసం కలపాలి. మనం నిత్యం భోజనం చేసే సమయంలో తరచుగా సలాడ్‌ను తినేటప్పుడు దీనికి కాస్త నిమ్మరసం కలిపితే ఇంకా మంచిది. నిమ్మకాయలోని పొటాషియం, విటమిన్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయి.మ్మకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే ఫైబర్, కాల్షియం, పొటాషియం, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.కాబట్టి ఖచ్చితంగా కూడా నిమ్మరసాన్ని తీసుకోండి. షుగర్ సమస్యతో పాటు ఇంకా అలాగే అనేక రకాల సమస్యలకు కూడా చాలా ఈజీగా చెక్ పెట్టండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: