కీళ్ళ నొప్పులు ఇలా ఈజీగా తగ్గించుకోవచ్చు?

Purushottham Vinay
కీళ్ల నొప్పుల సమస్య అందరిని ఎంతగానో వేధిస్తుంది. ఈ సమస్య బారిన పడడానికి ఎన్నో కారణాలు ఉంటాయని అని చెప్పవచ్చు. చలికాలంలో ఈ సమస్య తీవత్ర అయితే మరీ ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు పెద్దవారిలోనే కనబడే ఈ కీళ్ల నొప్పులు ప్రస్తుత కాలంలో యువతలోనూ కనబడుతున్నాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నా కూడా కీళ్ల నొప్పులు వస్తాయి. శరీరంలోకి బ్యాక్టీరియా ప్రవేశించడం వల్ల ఇన్ ప్లామేషన్ వస్తుంది. కీళ్ల వాతం కూడా వస్తుంది. దీని వల్ల కీళ్లు దెబ్బతింటాయి. దెబ్బ తిన్న కీళ్లు తిరిగి సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పడుతుంది.అయితే మనం వంటల్లో వాడే దాల్చిన చెక్క  కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్కను తరచూ మన ఆహారంలో తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గడంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. దాల్చిన చెక్కలో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. 

కర్పూరాన్ని ఉపయోగించి కూడా మనం కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. ఒక గిన్నెలో కొబ్బరి నూనెను, కర్పూరాన్ని వేసి వేడి చేయాలి. ఈ నూనె గోరు వెచ్చగా అయిన తరువాత కీళ్ల నొప్పులు ఉన్న చోట రాసి మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.కీళ్ల నొప్పులతో బాధపడే వారు రోజూ గోరు వెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల కూడా చక్కటి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల అధిక బరువు కూడా తగ్గుతారు.అలాగే ఒక బంగాళాదుంపను తీసుకుని ముక్కలుగా చేయాలి.ఈ ముక్కలను గిన్నెలోకి తీసుకుని దాని నిండా నీళ్లు పోసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే పరగడుపున ఈ నీటిని తాగాలి. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.ఈ టిప్స్ పాటించడం వల్ల ఎటువంటి నష్టాలు లేకుండా కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: