ఇవి ఎక్కువగా తింటే ఆరోగ్యానికి ప్రమాదం?

Purushottham Vinay
ఇవి ఎక్కువగా తింటే ఆరోగ్యానికి ప్రమాదం?
ఆహారాలలో ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి. చీజ్, క్యాన్డ్ సూప్, రొయ్యలు, పిజ్జా, ప్రాసెస్ చేసిన ఆహారాలలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని పరిమితంగా తీసుకోవాలి.సాధారణంగా గుడ్డు తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందనేది మనందరికీ తెలిసిందే. అయితే, ఆర్థరైటిస్‌తో బాధపడేవారు గుడ్డును అధికంగా తినొద్దని సూచిస్తున్నారు నిపుణులు. గుడ్డు సొనలో అధిక స్థాయిలో అరాకిడోనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కీళ్లలో మంట కలిగిస్తుంది. అందుకే కొడిగుడ్లను మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.ఆల్కహాల్ ఆర్థరైటిస్ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది. ఈ కారణంగా ఆర్థరైటిస్ లక్షణాలు ఉన్నవారు మద్యపానాన్ని పరిమితం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.సంతృప్త కొవ్వులు, అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్‌.. మయోన్నైస్, వనస్పతి, క్రీమ్ చీజ్, వెన్న, చీజ్‌లలో ఎక్కువగా ఉంటాయి. వీటికి దూరంగా ఉండటం మంచిది. వీటి వినియోగం పరిమితంగా ఉండాలి. లేదంటే ఆర్థరైటిస్ సమస్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది.ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే పదార్థాలు అతిగా తీసుకోవద్దు. మొక్కజొన్న, కుసుమ, పొద్దుతిరుగుడు, వేరుశెనగ, సోయా నూనెలను అధికంగా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం ఆర్థరైటిస్ సమస్యను మరింత తీవ్రం చేస్తుంది.


ప్రాసెస్ చేసిన పాలు, పాల ఉత్పత్తులలోని ప్రోటీన్ కీళ్ల చుట్టూ ఉన్న కణజాలానికి ఇబ్బంది కలిగిస్తుంది. రెడ్ మీట్‌లో ఉండే సంతృప్త కొవ్వులు వాపును మరింత పెంచుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి.ఫ్రై చేసిన ఆహారాలు, వేయించిన మాంసం, చల్లబడిన ఆహార పదార్థాలు, కాల్చిన ఉత్పత్తులు, ప్యాక్ చేసిన ఆహారం, చిరుతిళ్లు ఆర్థరైటిస్ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.ఆర్థరైటిస్‌తో బాధపడేవారు చక్కెరతో చేసిన పదార్థాలను తక్కువగా తినాలి. స్వీట్స్, ఐస్‌క్రీమ్, సోడా మొదలైన వాటికి దూరంగా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆహారాలను ఎక్కువగా తినకుండా మితంగా తినండి. ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: