కూరగాయలతో కోడిగుడ్డును వండ వచ్చా..?

Divya
మనం ఆరోగ్యంగా ఉండడానికి ఎన్నో ఆహార పదార్థాలను తింటూ ఉంటాము. అందులో ముఖ్యంగా కూరగాయలు, కోడిగుడ్లు, మాంసం, పాలు వంటివి తరచూ మనం భుజిస్తూనే ఉంటాము. అయితే వీటన్నిటిని ఎలా పడితే అలా తినడం వల్ల మన ఆరోగ్యానికి హానికరం కలుగుతుందని వైద్యులు సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కోడిగుడ్డును ఏవైనా కూరగాయలతో కలిపి తిన్నట్లు అయితే చాలా ప్రమాదమని వైద్యులు సూచిస్తున్నారు. వాటి గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మనం ప్రతిరోజు మన పనులను చక్కగా చేసుకోవాలి అంటే కచ్చితంగా మనకి ఆహారం అవసరమే. అయితే ఆహారంలో ఎన్నో పోషకాలు, విటమిన్లు సైతం కలిగి ఉంటాయి అందుచేతనే వాటిని వేరే పదార్థాలతో కలిపి తింటే వాటి రుచి నశించడమే కాకుండా జీర్ణవ్యవస్థకు విరుద్ధంగా తయారవుతాయి. ఇది తాజాగా ఒక అధ్యయనంలో వెలుగడం జరిగింది. పరిశోధకులు కొంతమంది వ్యక్తుల మీద ఇలాంటి ప్రయోగం  జరిగినట్లుగా వైద్యులు సూచిస్తున్నారు. అయితే కోడి గుడ్డును ఇతర కూరగాయలతో కలిపి తినడం వల్ల ఆ వ్యక్తుల యొక్క జీర్ణ వ్యవస్థ చాలా బలహీనంగా కావడం జరిగిందని తెలియజేశారు.

అయితే పొట్లకాయ కోడిగుడ్డును కలిపి తినడం వల్ల చాలా ప్రమాదం జరిగిందని నిపుణులు తెలియజేస్తున్నారు. వాస్తవానికి పొట్లకాయలు ఎక్కువ శాతం నీరు, ఫైబర్, అధికంగా ఉంటుంది ఇందులో కొద్ది మొత్తంలోని ప్రోటీన్లు పిండి పదార్థాలు కూడా ఉంటాయి. ఇక ఇందులో విటమిన్..B1,2,3,6,9,C వంటి పుష్కలంగా లభిస్తాయి వీటితోపాటు పొటాషియం మెగ్నీషియం, ఐరన్, జింక్, సోడియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా లభిస్తాయి.కానీ కోడిగుడ్డులో మాత్రం విటమిన్ -A, B-1,2,5,9 వంటివి కలిగి ఉంటాయి. ఇక వీటితోపాటు ఐరన్ ,ఫాస్ఫరస్ ,జింక్ తదితర ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. ఈ విధంగా రెండు వాటిలో కూడా ఆరోగ్యకరమైన పోషకాలే ఉంటాయి అయితే ఈ రెండిటిని కలిపి వండడం వల్ల పలు సమస్య ఎదురవుతుందట. వీటిని తిన్న తర్వాత జీర్ణం కాక కడుపులో చాలా గందరగోళం గా ఏర్పడి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. అందుచేతనే ఇలాంటి విషయంలో జాగ్రత్త గా ఉండాలి అని తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: