ఫోన్ పక్కన పెట్టుకొని నిద్రపోతే కలిగే నష్టాలు?

Purushottham Vinay
ఫోన్ పక్కన పెట్టుకొని నిద్రపోతే కలిగే నష్టాలు?

ఇక రాత్రి పడుకునే ముందు మొబైల్ చూసిన తర్వాత చాలామంది పక్కన పెట్టుకుంటారు. మరికొందరు దిండు కింద పెట్టుకుని నిద్రపోతారు. అయితే ఇలా మొబైల్‌ను దిండు కింద పెట్టుకుని పడుకోవడం చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనికి సంబంధించి పలు రకాల పరిశోధనలు చేసింది. మొబైల్ వల్ల వెలువడే రేడియో ఫ్రీక్వెన్సీ మన ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇక ఇది నిద్రకు తీవ్ర అంతరాయం కలిగిస్తుందట. ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సిన విషయమేమిటంటే.. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ పెద్దల కంటే పిల్లలకు బాగా హానికరమని అధ్యయనాలు చెబుతున్నాయి.పరిశోధనల ప్రకారం.. రాత్రివేళల్లో తరచూ ఫోన్‌ మోగితే నిద్రకు ఆటంకం కలుగుతుంది. ఈసమయంలో వెలువడే రేడియో ఫ్రీక్వెన్సీ శరీరాన్ని త్వరగా అలసిపోయేలా చేస్తుందట. 


ఇక ఇది క్రమంగా మన పని తీరుపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుందట. కాబట్టి రాత్రి వేళల్లో మొబైల్‌ను దూరంగా ఉంచుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఫోన్‌ను దిండు కింద పెట్టుకుని నిద్రపోతే అతి పెద్ద ప్రమాదం మొబైల్‌ పేలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మొబైల్‌ బ్యాటరీ ఎక్కువగా హీట్‌ కావడం దీనికి ప్రధాన కారణం. అలాగే చాలామంది నిద్రపోయేటప్పుడు ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టి నిద్రపోతుంటారు. ఇది కూడా చాలా ప్రమాదకరం.మొబైల్‌ని దిండు కింద పెట్టుకుని పడుకునేటప్పుడు ఇక దాని బ్లూ లైట్ మన శరీరంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. కాల్స్‌ లేదా మెసేజ్‌ వచ్చినప్పుడల్లా రింగ్ టోన్ ప్లే అయినప్పుడల్లా చీకట్లో ఫోన్‌లోని బ్లూ లైట్‌ వెలుగుతుంది. ఇలా పదే పదే బ్లూ లైట్‌ చూడటం వల్ల కళ్లకు హాని కలుగుతుంది.కాబట్టి ఫోన్ ని నైట్ కాస్త దూరంగా పెట్టుకొని నిద్రపోండి. లేదంటే ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు ఎదురుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: