మెదడు పనితీరు బాగా మెరుగుపడాలంటే ఇలా చేస్తే సరి..!!

Divya
ప్రతిరోజు ప్రతి ఒక్కరం సులువుగా చేయగలిగే శారీరక ఎక్సర్ సైజులో రన్నింగ్ కూడా ఒకటి. ప్రతిరోజు 10 నిమిషాల పాటు రన్నింగ్ చేసినట్లయితే.. శరీరంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని తాజాగా వైద్యులు ఒక అధ్యయనంలో తెలియజేయడం జరిగింది. రన్నింగ్ మానసిక ఆరోగ్యాన్ని కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు. ప్రతిరోజు కనీసం కొద్దిసేపు అయినా రన్నింగ్ చేయడం వల్ల మెదడులో ఉండే బై లెటర్ అనే యాంటీ రియార్ వల్ల రక్త ప్రసరణ బాగా సులువుగా ప్రేరేపించబడుతుందట. అందుచేతనే మానసిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు కనీసం 10 నిమిషాలు అయినా రన్నింగ్ చేయడం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.

మెదడులో ఎక్కువగా డేటా స్టోర్ అయ్యి స్తంభంగా ఉంటుంది.. అందుచేతన రన్నింగ్ చేయడం వల్ల యాంటీ రియర్ తో రక్తం ప్రసారమయ్యి.. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా చేస్తుందని పరిశోధకులు తాజా అధ్యయనంలో తెలియజేశారు. ముఖ్యంగా రన్నింగ్ చేసేవారు అనుకూలమైన సమయం  ఎంచుకొని క్రమం తప్పకుండా వారంలో మూడు రోజులు అయిన రన్నింగ్ చేస్తే ఒత్తిడి నుంచి, అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు మరెన్నో సమస్యలను దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా మనకు ఉండే శరీర ఆకృతిని బట్టి రన్నింగ్ సమయాన్ని ఎంచుకోవాలి.
ముఖ్యంగా రన్నింగ్ చేసే ప్రదేశాలలో కూడా పలు జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి. ముఖ్యంగా ఎత్తైన, లోయలు గా ఉన్న ప్రదేశాలలో అసలు
పరిగెత్తకూడదు. ఇలా పరిగెత్తడం కూడా చాలా ప్రమాదకరం. ముఖ్యంగా రన్నింగ్ చేసే ముందు టీ షర్టు ని కచ్చితంగా ధరించాలి. టీ షర్టుతో రన్నింగ్ చేయడం వల్ల చమటను పీల్చుకునే స్వభావం కలదు. తద్వారా మనం తేలికగా రన్నింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇలా ప్రతిరోజు చేస్తే బరువు తగ్గడంతో పాటు మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. ముఖ్యంగా రన్నింగ్ చేసిన వెంటనే నీటిని తాగకూడదు ఇది చాలా ప్రమాదం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: