అధికంగా నూనె వినియోగిస్తున్నారా? జాగ్రత్త?

Purushottham Vinay
అన్ని రకాల వంటల్లో నూనె అనేది చాలా తప్పనిసరి. పోపు వేయాలన్నా, వేపుళ్లు చేయాలన్నా ఇంకా అలాగే పొడులు చేయాలన్నా నూనె అనేది అత్యవసర పదార్థం. నూనె లేని వంటకాలను అసలు ఊహించుకోలేం.అయితే అధిక నూనె వినియోగం ఆరోగ్యానికి చాలా హానికరం అనే విషయం మనకు తెలిసిందే. ఈ మేరకు వైద్యులు ఇంకా నిపుణులు కూడా నూనె వాడకంపై సూచనలు ఇస్తూ ఉంటారు. అధిక నూనె వల్ల శరీరంలో అనవసరపు కొవ్వు అనేది పేరుకుంటుంది. అది రక్తనాళాల్లో రక్త ప్రవాహాన్ని బాగా అడ్డుకుంటుంది. తద్వారా గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వంటలో ఉపయోగించే నూనెతో సహా ప్రతిరోజూ 3-4 టీ స్పూన్లు శరీర అవసరాలకు బాగా సరిపోతుంది. నూనెల్లోని ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు శరీరానికి అవసరం కాబట్టి నూనె లేని ఆహారం తినడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎయిమ్స్ వైద్యుల ప్రకారం నూనెలోని మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్ రక్తంలోని కొవ్వులను తగ్గించడంలో చాలా ప్రభావంతంగా పని చేస్తుందని తేలింది. ఈ రకమైన కొవ్వు ఆలివ్ నూనె ఇంకా కనోలా నూనెలో అధికంగా ఉంటుంది. అవోకాడోలు, పిస్తా, వాల్‌నట్‌, బాదం ఇంకా నువ్వులు నూనెలో మోనోశాచురేటెడ్ కొవ్వు అధిక మొత్తంలో లభిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల పరిస్థితిని మెరుగుపరచడం, గుండె జబ్బులను నివారించడం ఇంకా ఆయుర్దాయాన్ని పెంచేందుకు నూనెలోని ఈ కొవ్వు ఉపయోగపడుతుంది.


అలాగే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు చేపల్లో సమృద్ధిగా ఉంటాయి. అయితే చాలా మంది చేపలు తినేందుకు అంత ఆసక్తి చూపించరు. కాబట్టి వారికి ఈ ఫ్యాటీ ఆమ్లాల్లోని పోషకాలు అనేవి లభించవు. ఇవి గుండె ఆరోగ్యాన్ని బాగా రక్షిస్తాయి. కాబట్టి నూనెలను తగినంత మొత్తంలో తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. వాల్‌నట్‌లు, ఆవాలు, సోయాబీన్, నువ్వులు, వేరుశనగ, కనోలా నూనె, అవిసె గింజలు ఇంకా అలాగే చియా గింజలతో తయారైన నూనెల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని ఉపయోగించడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి.ఇక దక్షిణాది రాష్ట్రాల్లో అధికంగా ఉపయోగించే కొబ్బరి నూనెలోనూ సంతృప్త కొవ్వులు ఇంకా పాల్మిటిక్ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నూనె కూడా శరీర ఆరోగ్యాన్ని బాగా కాపాడుతుంది. అయితే.. అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు నూనెను అధికంగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు అనేవి వస్తాయి. అందుకే శరీరానికి అవసరమైనంత మేరకే తీసుకోవడం చాలా ఉత్తమం.మొతాదు కనుక మించితే పెను ఆరోగ్య సమస్యలు తప్పవు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: