పిల్లల్లో, యుక్త వయసు వారిలో బ్లడ్ ప్రెసర్ కి కారణాలు చెప్పిన నిపుణులు..!!

Divya
చాలా మంది హైబీపీ ( అధిక రక్తపోటు) సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా పెద్దవారిలో హైబీపీ లక్షణాలు కనిపిస్తుంటాయి. కానీ ఈ మధ్య పిల్లల్లోనూ, యుక్త వయసు వారు కూడా హైబీపీతో బాధపడుతున్నట్టు అధ్యయనం తెలిపింది .
పిల్లల్లో హైబీపీకి వారి జీవనవిధానమే ముఖ్య కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, చక్కెరలు , ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల వారిలోనూ హైబీపీకి దారితీస్తోంది.
హైబీపీతో ఇబ్బందిపడుతున్న 5మంది పిల్లలను తీసుకుంటే వారిలో నలుగురు పై కారణాల వల్లనే హైబీపీ ఇబ్బంది పడుతున్నారని తెలిసింది.ఈ విషయాన్నీ పరిశోదించడం కోసం ఆరు నుంచి పదహారేళ్ల వయస్సున్న బాలల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. పిల్లల ఆరోగ్యంపై దృష్టి ఉంచాలని వారి తల్లిదండ్రులకు నిపుణులు సూచించారు.
హైబీపీ, ఊబకాయం వంటి ఇబ్బందులు ఎక్కువగా ఒకే కుటుంబంలోని వ్యక్తుల్లో కనిపిస్తుంటాయి.అందువల్ల ఇలాంటి కుటుంబాల్లోని వ్యక్తులు తమ జీవన విధానంలో మార్పులు చేసుకోవడమే పరిష్కారం అని పేర్కొన్నారు. ముఖ్యంగా హై బీపీతో ఇబ్బందిపడే పిల్లలకు పచ్చి కూరగాయలు, తాజా పండ్లు,పైబర్ ఎక్కువగా వున్న  ఆహారం అందించడంతోపాటు సాల్ట్ , తీపి పదార్థాలను , శీతల పానీయాలు, చెడు కొలెస్ట్రాల్ కలిగిన పదార్థాలను వారి ఆహారాల  నుంచి దూరంగా ఉంచడం వల్ల వారిలో అధిక రక్తపోటు లక్షణాలు అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచించారు.
ఇక పిల్లలు, టీనేజర్లు రోజులో ఒక గంటపాటైనా శారీరక శ్రమ చేయాలని,జాగింగ్, సైక్లింగ్ స్విమ్మింగ్ చేయాలని, ఎక్సర్సైజు చేయడం అలవాటు చేయాలనీ సూచించారు.యుక్త వయసు వారు ఆఫీస్ వర్క్ అని రెండు గంటలకు మించి ఒకే చోట కదలకుండా కూర్చోవడం వంటివి చేయకూడదని తెలిపారు. చిన్న పిల్లలు ఎక్కువగా టీవీ, స్మార్ట్ ఫోన్ వినియోగించకుండా తల్లిదండ్రులు వారిని శారీరక ఇతర పనుల వైపు మళ్లించాలని వెల్లడించారు. తరచుగా వారి బరువు, ఆహారపు అలవాట్లు,వ్యాయామ సమయం వంటి విషయాల్లో చిన్న లక్ష్యాలను నిర్దేశించి దానికి అనుగుణంగా చేసేలా వారిని పరిశీలిస్తుండాలని తల్లిదండ్రులకు ఆరోగ్యనిపుణులు సూచిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: