చికెన్ తో కలిపి ఈ ఆహారాలు అస్సలు తినకండి?

Purushottham Vinay
చికెన్‌ అంటే చాలు నాన్ వెజ్ ప్రియులకు నోరూరుతుంటుంది. మనలో కూడా చాలా మంది కూడా చికెన్‌ను అమితంగా ఇష్టపడుతుంటారు. చికెన్‌తో రకరకాల వంటలను కూడా తయారు చేసుకుని లాగించేస్తుంటారు.ఇక పరిమితంగా తీసుకుంటే చికెన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది. సీజనల్ వ్యాధులు దరి చేరకుండా కూడా అడ్డుకట్ట వేస్తుంది. ఇమ్యూనిటీ సిస్టమ్‌ను కూడా బూస్ట్ చేస్తుంది. ఇలా ఎన్నో రకాల లాభాలు అందిస్తుంది. కానీ, చికెన్‌తో పాటుగా కొన్ని కొన్ని ఆహారాలను పొరపాటున కూడా అసలు తీసుకోరాదు. ఆ ఆహారాలు ఏంటో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం తెలుసుకుందాం.చికెన్‌, పెరుగు ఈ రెండిటిని కలిపి లేదా ఒకేసారి తినే అలవాటు చాలా మందికి కూడా ఉంటుంది. అయితే ఇకపై మాత్రం మీరు అలా అస్సలు చేయవద్దు. చికెన్‌, పెరుగు ఒకేసారి తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం అనేది పడుతుంది. దాని వల్ల అజీర్తి ఇంకా గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశాలు అధికంగా ఉంటాయి.అలాగే కొందరు చికెన్‌ ఇంకా చేపలు ఒకేసారి తింటుంటారు.అయితే ఈ రెండిటిలోనూ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది.


అందువల్ల, ఈ రెండిటినీ ఒకేసారి తీసుకుంటే శరీరంలో ప్రోటీన్ లెవల్స్ అనేవి బాగా పెరిగిపోతాయి.ఫలితంగా తలనొప్పి, కడుపు తిమ్మిరి ఇంకా మలబద్ధకం వంటివి ఇబ్బంది పెడతాయి.చికెన్ తిన్న వెంటనే పండ్లను లేదా పండ్లను తిన్న వెంటనే చికెన్‌ను పొరపాటున కూడా అసలు తీసుకోరాదు. ఈ రెండిటినీ ఒకేసారి తీసుకుంటే వాంతులు, కడుపు ఉబ్బరం ఇంకా కడుపులో మంట అలాగే చికాకు వంటి సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.ఇక చికెన్‌, బంగాళదుంపలను కూడా ఒకేసారి అసలు తీసుకోరాదు. ఈ రెండిటిది వరస్ట్ ఫుడ్ కాంబినేషన్ అని పోషకాహార నిపుణులు కూడా చెబుతున్నారు. చికెన్‌, బంగాళదుంపలను కలిపి తీసుకుంటే జీర్ణ వ్యవస్థ అనేది చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: