ఆరంజ్ తొక్క వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..?

Divya
ప్రస్తుతం మనకు ఎన్నో పండ్లు దొరుకుతూనే ఉంటాయి.అందులో ఆరంజ్ సీజన్ వచ్చిందంటే చాలు ఈ కాయలు మార్కెట్లో ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. ఎక్కువగా ఇందులో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. ఇక అంతే కాకుండా వీటిని జ్యూస్ చేసుకొని తాగడం వల్ల ఎంతో రుచిగా ఉంటుంది. అయితే ఈ పండ్లను మనం తినేటప్పుడు తొక్కను తొందరగా తీసివేసి చెత్తలో పడేస్తూ ఉంటాము. అయితే ఇప్పుడు చెప్పుకుపోయే ప్రయోజనాల వల్ల ఇకమీదట మీరు ఈ నారింజ పండు తొక్కను పారివేయరు వాటి వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలను ఇప్పుడు మనకు తెలుసుకుందాం.

1).ఆరంజ్ తొక్క వల్ల స్కిన్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి ఇందులో సిట్రిక్ ఆమ్లం ఉండడం వల్ల చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.
2). పొడి చర్మం ఎవరికైనా ఉన్నట్లు అయితే ప్రతిరోజు కూడా ఈ నారింజ పౌడర్ ని నీటిలో కలుపుకొని ముఖానికి  రాసుకున్నట్లు అయితే మొటిమలు బ్లాక్ హెడ్ తొలగిపోతాయి.

3). నారింజ తొక్కలను మనం వేడి నీటిలో ఉడకబెట్టి కొన్ని సుగంధ ద్రవ్యాలను అందులోకి వేయడం వల్ల మన వంట గదిలో వచ్చేటువంటి దుర్వాసన నుండి మనం విముక్తి పొందవచ్చు.

4). నారింజ తొక్కలో ఉండే సిట్రిక్ వల్ల డైనింగ్ టేబుల్, కిచెన్ సామాన్యులు వంటివి చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. నారింజ తొక్కలను బాగా ఎండబెట్టి వాటిని వెనిగర్ తో గాలి దూరని జాడీలో నిల్వ ఉంచి ఆ నీటిని మూడు వారాల తర్వాత స్ప్రే బాటిల్లో వడకట్టి వాటి ద్వారా మనం అన్నిటిని తుడుచుకోవచ్చు.
5). ఇక నారింజ పండు నిమ్మ పండు అన్నీ కూడా ఒకే జాతికి చెందినవి అందుచేతనే ఈ రెండిట్లో ప్రతిదీ కూడా మనకు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి.
6). నిమ్మకాయ ఊరగాయ ద్వారా పలు ప్రయోజనాలు పొందడమే కాకుండా వీటి వల్ల పలు ప్రయోజనా లు కూడా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: