వానాకాలంలో ఇవి అస్సలు తినకండి!

Purushottham Vinay
వానాకాలం అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే ఈ కాలంలో ఖచ్చితంగా తినే ఆహారం పై శ్రద్ధ చూపించాలి. లేకుంటే ఖచ్చితంగా మన ఆరోగ్యం దెబ్బ తినే అవకాశాలు ఉంటాయి.ఇక వర్షాకాలంలో అందరు వేడి వేడి స్నాక్స్‌ తినేందుకు ఇష్టపడతారు. అయితే చాలా మంది కూడా బయట లభించే వివిధ రకాల జంక్‌ ఫుడ్‌ను తింటూ ఉంటారు.సముద్రంలో లభించే చేపలు సాధారణంగా వర్షాకాలంలో కూడా సంతానోత్పత్తిని కలిగి ఉంటాయి. కావున వర్షాకాలంలో వీటిని తినకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో నీరు కలుషితమయ్యే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చేపలను తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయని ఎక్కువగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.అలాగే వానా కాలం ప్రతి ఒక్కరూ సాయంత్రం ఏదో ఒక స్నాక్‌ తినడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా టీతో పాటు పకోడీలు కూడా తినాలని చాలా మంది అనుకుంటారు. అయితే ఇలా క్రమం తప్పకుండా తినడం వల్ల ఎసిడిటీ ఇంకా జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలుంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


ఇక అంతేకాకుండా కడుపులో ఉబ్బరం వంటి ఇబ్బందులు కూడా ఎక్కువగా కలుగుతాయి.అలాగే మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మందిలో జీర్ణవ్యవస్థ అనేది చాలా సున్నితంగా మారుతుంది. కాబట్టి వర్షాకాలంలో పాల ఉత్పత్తులను అతిగా తీసుకోకపోవడం మేలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని అతిగా తినడం వల్ల దగ్గు ఇంకా జలుబు వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అలాగే ఆకుకూరల్లో చాలా రకాల పోషకాలు ఉంటాయి. కానీ వీటి పట్ల వానా కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు పేర్కొన్నారు. వాతావరణంలో తేమ స్థాయిలు పెరగడం వల్ల వాటిపై సూక్ష్మక్రిములు ఎక్కువగా పెరిగే అవకాశాలుంటాయి. కావున వీటిని వండే క్రమంలో రెండు సార్లు శుభ్రం చేయడం ఆరోగ్యానికి మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: