ఈ ఆకుతో అన్ని రోగాలు పరార్..!!

Divya
ప్రకృతి ప్రసాదించిన ఎన్నో మొక్కలలో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు చెప్పబోయే ఈ ఆకు కూడా ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది. ఇక పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ ఆకు చూస్తేనే ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. అదే వాము ఆకు.. కొన్ని ప్రాంతాలలో ఈ మొక్కను దగ్గు మొక్క అని కూడా పిలుస్తారు. ఇక ఇటీవల కాలంలో చాలామంది క్షణం తీరిక లేకుండా పెద్దవాళ్లు వ్యవసాయ పనుల్లో మునిగిపోతుంటే.. చిన్నవాళ్లు ఆఫీస్ పనుల్లో పూర్తిగా నిమగ్నమవుతున్నారు.
ఇక శ్రమతో కూడిన వ్యాయామాలు చేసినప్పుడు.. అధిక ఒత్తిడి,  జ్వరం,  పోషకాల లోపం కారణంగా శరీరానికి నొప్పులు చుట్టుకుంటాయి. ఇక కొంతమంది బాడీపెయిన్స్ రాగానే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు వేసుకుంటూ రిలీఫ్ పొందుతూ ఉంటారు. కానీ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే  ప్రమాదం ఉంది కాబట్టి ఈ వాము ఆకుతో తయారుచేసిన డ్రింక్ తాగితే ఎలాంటి శారీరక నొప్పులు అయినా సరే దూరం అవుతాయి.. ఇకపోతే ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకుందాం..
ముందుగా ఒక కప్పు వాము ఆకులను తీసుకొని శుభ్రంగా నీటిలో కడగాలి.. ఇప్పుడు ఒక గుడ్డ పైన వాటిని పరిచి తడి లేకుండా చేసుకోవాలి.. ఒక చెంచా సన్నగా తరిగిన అల్లం ముక్కలు,  ఈ ఆకులను రెండింటిని మిక్సీలో వేసి తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టాలి. ఇక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని వడకట్టి అందులో కొద్దిగా తేనె , నిమ్మరసం కలుపుకొని తాగాలి. ఇలా తయారు చేసుకున్న వామాకుల రసం తాగుతూ ఉంటే శారీరక నొప్పులు దూరం అవ్వడంతో పాటు దగ్గు కూడా దూరం అవుతుంది. ఇక మూత్రపిండాల్లో రాళ్లు , జలుబు , ఇన్ఫెక్షన్లు కూడా దరి చేరవు. విరివిగా పెరిగే ఈ మొక్కను మీ ఇంటి పెరట్లో పెంచుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: