కొలెస్ట్రాల్‌ : కంట్రోల్ చేసుకోపోతే ఇక ఆ జబ్బుతో చావడమే?

Purushottham Vinay
ఆరోగ్యమే మహా భాగ్యం అంటారు మన పెద్దలు. చిన్న చిన్న చిట్కాలతో మన ఆరోగ్యాన్ని చాలా ఈజీగా కాపాడుకోవచ్చు. చాలా మంది కూడా అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆహారంలో మార్పులు, ఏది తినాలి ఇంకా ఎంత సమపాళ్లలో తినాలి అన్నది తెలిస్తే శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకోవచ్చు.ఇక ఇటీవల కాలంలో చాలా మందిలో తలెత్తే సమస్య బరువు పెరగడం. అధికంగా బరువు పెరగడం కారణంగా అనేక రకాల సమస్యలు వస్తుంటాయి. శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరగడం వల్ల గుండె సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. చాలా మంది కొలెస్ట్రాల్‌ ఎక్కువై గుండె సమస్యలతో కన్నుమూసిన వార్తలు మనం ఎప్పుడూ వింటూనే ఉన్నాం. ఇక కొలెస్ట్రాల్‌ లో కూడా రెండు రకాలు ఉంటాయి. వీటిలో HDL కొలెస్ట్రాల్‌ ఇంకా LDL కొలెస్ట్రాల్‌ .. దీనిలో LDL కొలెస్ట్రాల్‌ వళ్ళ ప్రమాదం చాలా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల గుండె రక్తనాళ్ళాలు మూసుకుపోయి చాలా ప్రమాదం ఉంది.ఆహార పదార్ధాల కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్‌ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. మనం తినే ఆహరం లో కొలెస్ట్రాల్‌ లేకుండా చూసుకుంటే శరీరాన్ని చాలా ఆరోగ్యకరంగా ఉంచుకోవచ్చు , అలాగే బరువు కూడా తగ్గవచ్చు. పాలు, పాలపదార్థాలు, మాంసాహారం, చేపలు ఇంకా గుడ్లులోని పచ్చసొన వల్ల కొలెస్ట్రాల్‌ శరీరంలో చేరుతుంది. వాటిని తక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


 కొలెస్ట్రాల్‌ తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన టిప్స్ కూడా ఉన్నాయి. వాటి ద్వారా ఈజీగా కొలెస్ట్రాల్‌ ని కంట్రోల్ చేసుకోవచ్చు. వీటిలో వెల్లుల్లి అనేది ఇది రక్తంలోని నాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ప్రతి రోజూ కూడా సగం వెల్లుల్లిని తీంటే.. కొలెస్ట్రాల్ స్థాయి 10% తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా అలాగే కొత్తిమీర ధనియాల్లో యాంటీఆక్సిడెంట్లు అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతాయి. ధనియాలను నీటిలో మరిగించి ఆ నీటిని రోజు తాగడం ద్వారా కొలెస్ట్రాల్ బాగా కంట్రోల్ అవుతుంది. టొమాటోలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ, క్యాప్సికమ్‌, సెలెరీ, క్యారెట్లు, ఆకు కూరలు ఇంకా అలాగే ఉల్లిపాయలు వంటివి కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: