ఉసిరి గింజలతో ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

Purushottham Vinay
ఉసిరికాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది అని అందరికీ కూడా తెలిసిందే. ఇక ఈ చెట్టుకు కార్తీక మాసంలో చాలా మంది విశేష పూజలు చేస్తూ ఉంటారు.ఉసిరికాయలో బోలెడు ఔషధగుణాలు ఉన్నాయి.అలాగే వీటిని తింటే రోగ నిరోధక శక్తిని పెంపొందించడం తోపాటు అనేక అనారోగ్య సమస్యలు రాకుండా ఎంతగానో అడ్డుకుంటుంది.కేవలం ఉసిరి కాయే కాదు అందులోని విత్తనాలు కూడా మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది.ఇక ఈ ఉసిరి గింజలు లో విటమిన్ సి, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ వైరల్ ఇంకా అలాగే యాంటీ సెప్టిక్ గుణాలను కలిగి ఉన్నాయి. కంటిలో దురద, మంట ఇంకా అలాగే కళ్లలో ఎర్రబారడం వంటి సమస్యలు ఉన్నవారు ఈ ఉసిరి గింజలను బాగా మెత్తగా నూరి కళ్లపైన ఇంకా అలాగే కింది భాగంలో రాసుకోవాలి. లేదంటే రెండు చుక్కల ఉసిరి రసాన్ని కంటిలో వేస్తే కంటి నొప్పి నుంచి ఈజీగా ఉపశమనం లభిస్తుంది. ఉసిరి గింజలను ఎండబెట్టి దంచి బాగా పొడిచేసుకోవాలి.


ఈ పొడిని ప్రతిరోజు కూడా తీసుకుంటూ ఉంటే జీర్ణ సంబంధిత సమస్యలను ఈజీగా తొలగిస్తుంది. ఈ పొడిలో కొద్దిగా తేనె కూడా కలిపి తీసుకుంటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది.10 గ్రాముల ఉసిరి గింజలను ఎండలో ఎండబెట్టి ఇంకా వాటిని మెత్తగా పొడిగా చేసుకోవాలి. అలాగే అందులో 20 గ్రాముల చెక్కెర పొడిని కలిపి ఉంచుకోవాలి. ఉదయం ఖాళీ కడుపుతో 1 గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ పొడిని కలిపి 15 రోజుల పాటు రోజూ తీసుకోవాలి. ఇలా చేస్తే నిద్రలేమి నుండి బయట పడవచ్చు. ఇంకా ప్రశాంతమైన నిద్ర పడుతుంది. కొందరికి ముక్కు నుంచి కూడా రక్తస్రావం వస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఇలాంటి సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఉసిరి గింజల పేస్ట్‌ని రాస్తే సరిపోతుంది. ఈ ఉసిరి గింజలకు కాస్త నీటిని కలిపి గ్రైండ్ చేసి బాగా పేస్ట్‌లా చేయాలి. ఆ పేస్ట్‌ను మీ నుదిటిపై అప్లై చేస్తే తలనొప్పి సమస్య చాలా ఈజీగా తగ్గుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: