నోటి దుర్వాసన : పోవాలంటే ఈ తప్పులు చేయొద్దు!

Purushottham Vinay
నోటి దుర్వాసన అనేది తీవ్రమైన సమస్య కాకపోవచ్చు కానీ దీని కారణంగా మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. నోటి నుంచి వాసన రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి.ఇక వీటిలో ముఖ్యమైనది క్లీనింగ్‌ సరిగ్గా చేయకపోవడం. మీరు తినేవి లేదా తాగేవి నేరుగా దంతాలు ఇంకా చిగుళ్ల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే నోటిని హైడ్రేట్‌గా ఉంచుకోవడం చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సులభమైన చర్యలు తీసుకోవడం ద్వారా నోటి నుంచి వచ్చే వాసన ఈజీగా తొలగించవచ్చు.అలాంటి చర్యల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఇక ఆహారం తిన్న వెంటనే నీరు తాగడం తప్పు. తెలిసినా, తెలియక పోయినా చాలామంది  కూడా ఈ తప్పు చేస్తారు. ఆహారం తిన్నప్పుడు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల నోటి దుర్వాసన అనేది వస్తుంది. అలాగే కొంతమంది టీ తాగిన తర్వాత కూడా నీరు తాగుతారు. ఇలా చేయడం వల్ల నోటి దుర్వాసన ఎక్కువ వస్తుంది. ఈ అలవాటు మానుకుంటే చాలా మంచిది.అలాగే దంతాలలోని మురికిని తొలగించడానికి డాక్టర్ లేదా స్పెషలిస్ట్ వద్దకు వెళ్లడం చాలా ఉత్తమం.


కానీ మీరు ఇంట్లోనే దంతాలని బాగా శుభ్రం చేసుకోవచ్చు. మార్కెట్లో లభించే టూత్‌పిక్‌ని కూడా ఉపయోగించవచ్చు. దంతాలు ఇంకా అలాగే చిగుళ్ళలో పేరుకుపోయిన మురికిని తొలగించడానికి ఫ్లాసింగ్ అనేది చాలా ఉత్తమ మార్గం.ఇక అలాగే కొంతమందికి అయితే చాలా విచిత్రంగా ముక్కుతో కాకుండా నోటి ద్వారా శ్వాస తీసుకోవడం అనేది ఎక్కువగా అలవాటు. ఈ పొరపాటు అనేది నోటిలో లాలాజలం అనేది ఏర్పడకుండా చేస్తుంది. అంతే కాదు దీని వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం అనేది పడుతుంది.కాబట్టి ఖచ్చితంగా నోటితో కాకుండా ముక్కుతోనే శ్వాసను తీసుకోవాలి.అలాగే అల్పాహారం తిని నోరు శుభ్రం చేసుకోకుంటే ఖచ్చితంగా దుర్వాసన అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అల్పాహారంలో తక్కువ చక్కెర పదార్థాలు ఉండే విధంగా ఖచ్చితంగా చూసుకోవాలి. డైట్‌లో ఖచ్చితంగా కూడా పెరుగు ఉండే విధంగా చూసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: