మంచి నిద్ర పట్టాలంటే ఈ డ్రింక్ తాగాల్సిందే!

Purushottham Vinay
ప్రతి జీవికి నిద్ర అనేది చాలా అవసరం. కంటి నిండా కూడా సరైన నిద్ర అనేది లేకపోతే ఎన్నో రకాల సమస్యలను ఎదురుకోవాల్సి వస్తుంది. ఇంకా ఎన్నో రకాల వ్యాధుల బారిన పడతాము.ఇక సాధారణంగా రాత్రి పడుకొనే ముందు తీసుకొనే ఆహారం మన జీవక్రియలు ఇంకా రోగ నిరోధకశక్తి మీద ప్రభావం చూపుతుంది. ప్రతి మనిషికి కూడా రోజుకి 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం.మంచి నిద్ర ఇంకా మంచి పోషకాలు ఉన్న ఆహారం మన ఆరోగ్యం మీద ఖచ్చితంగా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి ఆ రెండింటినీ కూడా అసలు విస్మరించకూడదు.ఇప్పుడు మంచి ప్రశాంతమైన నిద్ర కోసం,శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం కావటానికి ఇంకా అలాగే బరువు తగ్గటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేసే ఒక డ్రింక్ గురించి మనం తెలుసుకుందాం.


అవే బాదం పాలు. ఈ బాదం పాలను రాత్రి పడుకోవటానికి ముందు తాగితే ఖచ్చితంగా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఒక మిక్సీ జార్ లో వేగించిన 7 బాదం పప్పులు ఇంకా అలాగే ఒక స్పూన్ బెల్లం పొడి లేదా ఒక స్పూన్ తేనె వేసి మెత్తగా చేసుకోవాలి.ఈ పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో కలుపుకోని వాటిని తాగాలి. ఈ విధంగా తాగటం వలన గుండె ఆరోగ్యాన్ని చాలా బాగా మెరుగుపరుస్తుంది. అలాగే విటమిన్ E కూడా చాలా సమృద్దిగా ఉండుట వలన మెదడు ఆరోగ్యంగా ఉండేలా చేయటమే కాకుండా వయస్సు పెరిగే కొద్ది వచ్చే అల్జీమర్స్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. కాల్షియం సమృద్దిగా ఉండుట వలన ఎముకలకు సంబందించిన సమస్యలు అసలు ఏమి లేకుండా కూడా చేస్తుంది.ఇంకా అలాగే పొటాషియం సమృద్దిగా ఉండుట వలన రక్తపోటు సమస్య కూడా ఖచ్చితంగా నియంత్రణలో ఉండటమే కాకుండా అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా చాలా ఈజీగా తగ్గిస్తుంది.ఇక అంతేకాకుండా కిడ్నీకి సంబందించిన సమస్యలు అనేవి అసలు ఏమి లేకుండా కూడా చేసి కిడ్నీల ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: