చెడు కొలెస్ట్రాల్ ను దూరం చేసే కరివేపాకు లాభాలు ఎన్నో..?

Divya
కరివేపాకు.. ప్రతి వంటలో కూడా పోపులో ఎక్కువగా ఉపయోగించే ఈ కరివేపాకును చాలామంది తినడానికి ఇష్టపడరు. ఇక దీనిని తీసి పక్కన పెట్టడం అందరికీ అలవాటయిపోయింది. కానీ కరివేపాకు తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ బయటకి పోవడమే కాకుండా బరువు తగ్గడంతో పాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇకపోతే కరివేపాకు వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయం తెలుసుకుందాము.

డయాబెటిస్తో బాధపడేవారు కరివేపాకును నమిలి మింగడం వల్ల చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి.  ముఖ్యంగా కరివేపాకులో ఉండే కొన్ని రకాల లక్షణాలు డయాబెటిస్ వారికి చక్కటి ఔషధంగా పనిచేస్తాయి. డయాబెటిస్ వారు కరివేపాకు తో తయారు చేసిన పొడిని తినడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. కరివేపాకులో విటమిన్ ఎ పుష్కలంగా లభించడం వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. ఎవరైతే దృష్టిలోపంతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు ప్రతి రోజు కరివేపాకు తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

ఇటీవల కాలంలో చిన్న వయసులోనే పిల్లలకు జుట్టు తెల్లబడుతోంది. అంతేకాదు జుట్టు రాలడం, చిట్లిపోవడం,  జుట్టు తెల్లగా మారడం లాంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇలాంటి సంబంధిత సమస్యలతో బాధపడేవారు కరివేపాకుతో తయారుచేసిన హెయిర్ మాస్క్ ను జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు ఒత్తుగా పెరగడానికి కాకుండా జుట్టు సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి. ముఖ్యంగా కరివేపాకు హెయిర్ మాస్క్ తయారు చేసుకునేటప్పుడు తప్పకుండా మందారం ఆకులను కూడా మిక్స్ చేస్తే జుట్టుకు అప్లై చేస్తే ఫలితాలు రెట్టింపు స్థాయిలో లభిస్తాయి.

రక్తహీనత సమస్య తో బాధపడేవారు కరివేపాకును తినడం వల్ల సమస్య దూరమవుతుంది. ఇక కిడ్నీలో ఏర్పడే రాళ్లలో సైతం కరివేపాకు కరిగిస్తుంది. రక్తపోటుతో బాధపడేవారికి కూడా కరివేపాకు సమర్ధవంతంగా పని చేస్తుందని చెప్పవచ్చు. ఇక ఇందులో ఉండే అధిక అంటే ఆక్సిడెంట్ల కారణంగా మూత్ర సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: