మీ పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటే రక్తహీనత సమ్యసే..!!

Divya

పుట్టిన తర్వాత కొంత మంది పిల్లలలో ఎక్కువమందికి శరీరంలో రక్తం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. శరీరంలో రక్తం లేకపోవడాన్ని రక్తహీనత అంటూ ఉంటారు. రక్తహీనత సమస్య పెద్దవారి కంటే పిల్లలలోనే ఎక్కువ శాతం కనిపిస్తున్నట్లు వైద్యులు సూచించారు. రక్తహీనత సమస్యతో బాధపడుతున్న పిల్లల లో పలు రకాల లక్షణాలు కనిపిస్తాయట. వాటిని సకాలంలో గుర్తించినట్లయితే వాటినుండి  బయట పడే వేయవచ్చు. హిమోగ్లోబిన్ 10 నుండి 11 గ్రాములు ఉండాలి. ఒకవేళ హిమోగ్లోబిన్ 8 % కంటే తక్కువగా ఉన్నట్లయితే అది చాలా ప్రమాదకరమని తెలుసుకోవాలి..

ఇక ఇలాంటి సమయంలో కచ్చితంగా రక్తం ఎక్కించాల్సి ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు. ఎంతోమందికి ఇలాంటివి జన్యుపరమైన కారణాల వల్ల వస్తాయని తెలియజేశారు. ఇలాంటి ఎక్కువగా  వారి తల్లిదండ్రుల నుండి పిల్లలకు వ్యాపించే అవకాశం  ఉంటుందట. అయితే ఈ వ్యాధి యొక్క లక్షణాలు గుర్తించుకోవడం ఎలాగో చూద్దాం. న్యూఢిల్లీలోని మాజీ శిశువైద్యుడు డాక్టర్ "ప్రవీణ్ కుమార్" తెలిపిన ప్రకారం చిన్న పిల్లల్లో చాలామంది ఈ సమస్య బారిన పడ్డవారు ఉన్నారట. ముఖ్యంగా నెలలు నిండకుండానే పుట్టిన పిల్లలకు ఇలాంటి సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
1). శరీరంలో ఈ వ్యాధి ఉన్నవారిలో ఎక్కువగా ఎర్రరక్తకణాలు అనేవి ఉత్పత్తి కావట. దీని ద్వారా అన్ని రక్తం నష్టం జరుగుతుందట.
2). ముఖ్యంగా చిన్న పిల్లలు ఎప్పుడూ అలసిపోతుంటారు.
3). ఈ సమస్య ఉన్నవారు చర్మంపై నల్లగా మారుతుంది.
4). ముఖ్యంగా ఈ రక్తహీనత సమస్య ఉన్నవారి కళ్ళు పసుపు రంగులో మారుతాయి. ఈ నాలుగు రక్తహీనత సంకేతాలని చెప్పవచ్చు.
ముఖ్యంగా మన శరీరంలో ఐరన్ ,విటమిన్ లు, ప్రోటీన్లు లేకపోవడం వల్లే ఇలాంటి రక్త హీనత సమస్య ఏర్పడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇటువంటి ఈ పరిస్థితులలో కచ్చితంగా పిల్లల ఆహారంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు సీజన్ ప్రకారం పనులు ఎక్కువగా తినిపించడం మంచిదట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: