దంతాల నొప్పి : ఈజీగా తగ్గించే టిప్!

Purushottham Vinay
సాధారణంగా ఒక్కోసారి దంతాలు కదిలి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. దంత పరిశుభ్రత లేకపోవడం, దంతక్షయం, ఇన్ఫెక్షన్ ఇంకా అలాగే దంతాలు వదులుగా మారడం వంటి రకరకాల కారణాల వల్ల ఈ సమస్య ఎదురవుతుంది.ఇక దానికి కారణం ఏదైనా కానీ దంతాలు కదిలి నొప్పి పుడుతుంటే అస్సలు భరించలేకపోతుంటారు. అప్పుడు చాలా అసౌకర్యంగా కూడా ఉంటుంది. ఈ క్రమంలోనే నొప్పి నుంచి ఉపశమనం పొందడం కోసం వారు పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. కానీ, ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ ఎఫెక్టివ్ టిప్ లను కనుక ట్రై చేస్తే సహజంగానే దంతాల నొప్పిని నివారించుకోవచ్చు.ఇక నేరేడు చెట్టు ఆకులు దంతాల నొప్పికు చెక్ పెట్టడంలో చాలా అద్భుతంగా సహాయపడతాయి. కొన్ని నేరేడు ఆకులను సేకరించి నీటిలో బాగా శుభ్రంగా కడిగి వాటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ నేరేడు ఆకుల పేస్ట్ తో రెండు నుంచి మూడు నిమిషాల పాటు దంతాలను బాగా తోముకుని.. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకు ఒకసారి గనుక చేస్తే మీకు నొప్పి తగ్గడమే కాదు కదిలిన దంతాలు మళ్లీ గట్టిబడతాయి.


చిగుళ్ల వాపు ఇంకా నొప్పి వంటి సమస్యలతో బాధపడే వారు కూడా ఈ చిట్కాను ప్రయత్నించవచ్చు.ఇంకా అలాగే కొన్ని లవంగాలను తీసుకుని మిక్సీ జార్‌లో వేసి మెత్తగా బాగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ లవంగాల పొడి, వన్ టేబుల్ స్పూన్ వెల్లులి రసం, చిటికెడు ఉప్పు, వన్ టేబుల్ స్పూన్ మీ రెగ్యులర్‌ టూత్ పేస్ట్‌ ఇంకా అలాగే వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి.ఆ తరువాత ఈ మిశ్రమాన్ని యూస్ చేసి మీ దంతాలను తోముకుని వాటర్‌తో బాగా శుభ్రం చేసుకోవాలి. ఈ టిప్ ని పాటించినా కదిలిన దంతాలు గట్టిబడి నొప్పి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.కాబట్టి దంతాల నొప్పితో బాధ పడే వారు ఖచ్చితంగా ఈ టిప్ ని పాటించండి. దంతాల నొప్పిని తగ్గించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: