బ్రేక్ ఫాస్ట్ : వీటిని అస్సలు తినొద్దు..!

Purushottham Vinay
ఇక ఈ బిజీబిజీ లైఫ్‌లో మనం అసలు ఎప్పుడు నిద్రపోతున్నామో..అసలు మార్నింగ్ ఎప్పుడు మేల్కొంటున్నామో..అనేది అస్సలు తెలియట్లేదు. ఈ క్రమంలోనే చాలామంది కూడా ఉదయాన్నే తమ బ్రేక్ ఫాస్ట్‌ను ఎక్కువగా మిస్ చేస్తుంటారు.మధ్యాహ్నం పూట భోజనాన్ని తినేయొచ్చులే అంటూ అల్పాహారాన్ని వారు బద్దకిస్తారు. అయితే అస్సలు అలా చేయొద్దని ఆరోగ్య నిపుణులు చాలా సీరియస్ గా అంటున్నారు.ఉదయాన్ని ఖచ్చితంగా తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్ ని చేయాలని అనేకమంది వైద్యులు సూచిస్తున్నారు. ఇక పోషకాలు నిండిన అల్పాహారాన్ని కనుక వారు సేవిస్తే.. ఆ రోజు మొత్తానికి అందాల్సిన ఎనర్జీ వారికి ఉంటుందని చెబుతున్నారు.ఉదయం కడుపులో ఏదైనా తిండి పడితేనే.. బండి ముందుకు నడవగలదని పెద్దలు కూడా చాలా సందర్భాల్లో అంటుంటారు. సరైన పోషకాహారం ఉదయం పూట మనం తినకపోతే ఎక్కడ లేని ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు అంటున్నారు. అయితే ఇక్కడ కూడా కొన్ని సూచనలు వారు ఇస్తున్నారు.ఉదయం పూట ఆయిల్ ఫుడ్స్ ని అస్సలు తినకూడదని చెబుతున్నారు.


ఆయిల్‌తో చేసిన పూరి ఇంకా అలాగే పరోటా వంటి వాటిని అల్పాహారాలుగా అస్సలు తీసుకోవద్దు అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఎక్కువ పంచదార వేసిన అల్పాహారం, వైట్ బ్రెడ్‌, రిఫైన్డ్ గ్రైన్స్‌తో తయారు చేసే టిఫిన్స్ ఇంకా అలాగే ప్రోటీన్ షేక్స్‌కు చాలా దూరంగా ఉండాలన్నారు. వీటి వల్ల లాభం కంటే నష్టమే చాలా ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఉదయం పూట ఆయిల్ లెస్ టిఫిన్స్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని వారు స్పష్టం చేశారు. ఉదయం పాట ఎక్కువగా ఇడ్లి నే మీ బ్రేక్ ఫాస్ట్ గా అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇడ్లీలో నూనె ఉండదు. అందువల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే చట్నీలో నూనెని తగ్గించండి. అలాగే ఏమైన పండ్లను మార్నింగ్ టైంలో బ్రేక్ ఫాస్ట్ గా చేస్తే ఇంకా చాలా మంచిది. ఆపిల్, బనానా లాంటి ఫ్రూట్స్ తినండి. లేదా ఎగ్ ని తింటే ఇంకా మంచిది. కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు మీరు పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: