జీరా వాటర్ తాగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

Purushottham Vinay
బరువు తగ్గించే గుణాలు జీలకర్రలో ఎంతో పుష్కలంగా ఉన్నాయి. దీన్ని రెగ్యులర్‌గా తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.జీలకర్రలో క్రిమినాశక గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, ఇది గాయాలు ఇంకా వాపులను త్వరగా మాన్పుతుందని వైద్యులు అంటున్నారు. కాని జీలకర్ర వాటర్ తాగే వాళ్లు ఖచ్చితంగా ఈ విషయాలు పక్కగా తెలుసుకోవాలి.. ఇక అవేంటంటే..బరువు తగ్గడంలో జీలకర్ర పాత్ర విషయానికి వస్తే..శరీరంలో బరువు అనేది పెరగడం వల్ల వీపు వైపు వాపు ఎక్కువగా ఏర్పడుతుంది. అయితే.. జీలకర్ర నీరు అనేది శరీరం నుంచి వీటిని తొలగించడానికి బాగా పనిచేస్తుంది. జీర్ణవ్యవస్థను కూడా బాగా మెరుగుపరుస్తుంది.ఇక బరువు తగ్గే సమయంలో, జీర్ణవ్యవస్థ సరిగ్గా ఉండటం అనేది చాలా ముఖ్యం.జీలకర్ర నీరు తాగడానికి సరైన మార్గం ఏంటంటే..చాలా మంది కూడా జీలకర్ర నీటిని తప్పుడు మార్గంలో తాగుతారు.. అందుకే వారికి ఆశించిన ఫలితాలు పొందలేరు.రాత్రిపూట జీలకర్రను నానబెట్టి ఇక ఉదయాన్నే ఈ నీటిని వేడి చేసుకొని తాగాలి.


జీలకర్రను ఈ విధంగా ఉపయోగించడం వల్ల శరీరంలోని కొవ్వును కరిగి బాగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మనలో చాలామంది కూడా పొద్దన్న లేచిన తర్వాతకొంచెం జీలకర్ర తీసుకుని వాటర్ లో వేసుకుని మరగబెట్టుకోని తాగుతుంటారు.. అలా కాకుండా పైన చెప్పినట్లు రాత్రంతా కూడా మీరు నానపెట్టి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.సమ్మర్ లో తాగకపోవడమే చాలా బెటర్..జీలకర్ర నీరు బాగా వేడి చేస్తుంది. దీని కారణంగా ఇది శరీర ఉష్ణోగ్రతను బాగా పెంచుతుంది. ఇక ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వేసవి కాలంలో ఈ నీటిని తాగడం మానేయాలి. ఏప్రిల్-జూన్ నెలల మధ్య తీసుకోకపోవడమే మంచిదంటున్నారు.. అయితే ఒకవేళ ఈ నీటిని కనుక తాగాలనుకుంటే.. గోరువెచ్చని జీలకర్ర నీటిని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.కాబట్టి పైన పేర్కొన్న విధంగా జాగ్రత్తలు పాటించి జీలకర్ర నీళ్లు తాగండి. ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: