ఈ నీటితో బరువు సులభంగా తగ్గవచ్చట..!!

Divya
సాధారణంగా ప్రస్తుతం అందరూ ఎదుర్కొంటున్న సమస్యలలో ఊబకాయం కూడా అత్యంత ప్రమాదకరంగా మారిపోయింది. ఇటీవల కాలంలో గజి బిజీ బిజీ లైఫ్ స్టైల్లో ఎవరూ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాకపోతే బరువు తగ్గడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు ఇప్పుడు చెప్పబోయే చిట్కాతో అధిక బరువు ఉంటే తగ్గిపోవచ్చు. ముఖ్యంగా వంటగదిలో ఉపయోగించే జీలకర్ర ఎన్నో ఔషధాలను నిండి ఉంటుంది ఇక ఇది ఆహారానికి రుచిని అందించడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుందని వైద్యులు తెలుపుతున్నారు. జీలకర్ర ను అధికంగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
జీలకర్రలో రోగనిరోధక శక్తిని పెంపొందించే గుణం పుష్కలంగా ఉంది అంతే కాదు క్రిమినాశక పిల్లలు కూడా ఎక్కువగా ఉన్నాయని వాపులను గాయాలను త్వరగా మాన్పుతుంది అని సమాచారం. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో జీలకర్ర చాలా చక్కగా పనిచేస్తుంది. అంతేకాదు జీలకర్రలో వుండే యాంటీ కార్సినోజెనిక్ లక్షణాల వల్ల  పొట్ట,  కాలేయంలో వచ్చే ట్యూమర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీలకర్రను నానబెట్టిన నీటిని తాగడం వల్ల అధిక బరువు దూరం అవుతుందట. అంతేకాదు సరైన మార్గంలో జీలకర్ర నీటిని తీసుకుంటే మంచి ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

ఇకపోతే జీలకర్ర నీటిని ఎప్పుడు తీసుకోవాలో తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇక లాంటి వాళ్లు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. తాగాలి అనుకునేవాళ్ళు ముందు రోజు రాత్రి నీటిలో జీలకర్ర వేసి నానబెట్టాలి. ఇక ఉదయాన్నే జీలకర్ర నానబెట్టిన నీటిని వేడి చేసుకొని తాగడం వల్ల శరీరంలో కొవ్వు కరిగి ఆరోగ్యంగా ఉండవచ్చు. జీలకర్ర నీటిని తాగడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది కాబట్టి వేసవి కాలంలో దీన్ని తాగకపోవడం మంచిది. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో జీలకర్ర నీళ్లు తాగకూడదు. మిగతా వేళల్లో గోరువెచ్చని జీలకర్ర నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: