వేసవిలో ఇవి అతిగా తింటే చాలా ఇబ్బంది పడాల్సిందే!

Purushottham Vinay
వేసవి కాలంలో ఖచ్చితంగా నూనె పదార్థాలను తీసుకోకుండా ఉండాలి. దీని వలల్ల విరేచనాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ నూనె పదార్థాలు దప్పికను కూడా బాగా పెంచుతాయి. అలాగే మనం డీహైడ్రేషన్‌కు గురయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే నూనెతో చేసిన పదార్థాలకు ఈ కాలంలో చాలా దూరంగా ఉండాలి.అలాగే వేసవిలో ఎక్కువగా లభించే మామిడి పండ్లను చాలా మంది ఎంతో ఇష్టంగా ఎక్కువగా తింటుంటారు. అయితే వీటిని పరిమితంగా తింటే చాలా ఉపయోగం ఉంటుంది. అలా కాదని, విపరీతంగా తింటే మాత్రం, శరీరంలో బాగా విపరీతంగా వేడి పెరుగుతుంది. దీని వల్ల విరేచనాలు ఎటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఏ పదార్థమైనా సరే పరిమితంగా తీసుకుంటేనే మంచింది. ఈ సీజన్‌లో దాహం చాలా ఎక్కువగా అవుతుంటుంది. ఇక మద్యం ఎక్కువగా సేవిస్తే, ఎక్కువగా దప్పిక వేస్తుంది. ఎక్కువగా దాహం వేయడంతో, నాలుక బాగా పొడిబారుతుంది. అలాగే శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది.

ఇక ఇలాంటి పరిస్థితి లివర్‌ ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తుంది. వీలైతే సమ్మర్‌లో అతిగా మద్యం తాగడం తగ్గించాలి.టీ ఇంకా అలాగే కాఫీలను ఎక్కువగా తాగడం వల్ల ఒంట్లో వేడి చాలా విపరీతంగా పెరుగుతుంది. టీ, కాఫీలను ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్‌ ఇంకా అలాగే ఎసిడిటీ బారిన పడే అవకాశం ఉంది. అందుకే వీటికి బదులుగా కొబ్బరి నీళ్లు, హెర్బల్ టీ, వాటర్ మిలాన్ జ్యూస్, కర్బూజా జ్యూస్‌ ఇంకా కీరదోస కాయలు లాంటివి తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే వీటిని తీసుకుంటే మన శరీరంలో నీటి శాతాన్ని పుష్కలంగా ఉంచేలా చేస్తాయి.వేసవి కాలంలో నాన్‌వెజ్‌కు చాలా దూరంగా ఉండాలి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమ్యలతోపాటు ఇంకా అలాగే ఒంట్లో అధిక కొవ్వు కూడా చేరే అవకాశం ఉంది. అలాగే పొట్టలో మంటను కూడా బాగా కలిగిస్తాయి. వీటితోపాటు కారం ఇంకా అలాగే మసాలాలు కూడా ఎక్కువగా తీసుకోకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: