డయాబెటిస్ ను తగ్గించాలంటే ఈ చిట్కా పాటించాల్సిందే..?

Divya
ఇటీవల కాలంలో చాలా మంది వయసుతో తేడా లేకుండా డయాబెటిస్ కు గురి అవుతున్నారు . ఇందుకు కారణం ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం లేదా ఎక్కువ సేపు నిల్చోనే ఉండడం.. శరీరానికి శ్రమ లేకపోవడం తినే ఆహారంలో కొన్ని రకాల పోషకాలు లోపించడం వంటి కారణాల వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు అధిక బరువు ఉన్న వారిని కూడా బాగా బాధిస్తోందని చెప్పవచ్చు. డయాబెటిస్ సైలెంట్ కిల్లర్ అని అంటారు. ఎందుకంటే డయాబెటిస్ వచ్చిన తర్వాత ఇక జీవితాంతం మందులు వాడాల్సిందే కాబట్టి ఈ మందుల వాడకం వల్ల శరీరంలోని మిగతా అవయవాల పనితీరు నెమ్మదిస్తుంది. చివరి దశకు చేరుకునే సరికి అవయవాలు కూడా పనిచేయడం ఆగిపోతాయి ఫలితంగా మనిషి మరణించే ప్రమాదం ఉంటుంది.
డయాబెటిస్ నుంచి మనల్ని మనం పూర్తిగా కాపాడుకోలేమా కాబట్టి కొంత వరకు ఉపశమనం అయితే ఉండవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా కొన్ని రకాల చిట్కాలను పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇకపోతే ఒక జ్యూస్ ని తయారు చేయాల్సి ఉంటుంది. జ్యూస్ కోసం కావలసిన పదార్థాలు ఏమిటంటే.. ఉసిరికాయ రసం నాలుగు టేబుల్ స్పూన్లు.. దాల్చిన చెక్క ఒక టేబుల్ స్పూన్.. కరివేపాకు ఆరు లేదా ఏడు ఆకులు తీసుకోవాలి. తయారీ విధానం.. బ్లెండర్ తీసుకొని పైన చెప్పిన అన్నింటిని వేసి రెండు కప్పుల నీటిని పోసి బాగా బ్లెండ్ చేయాలి.
రుచి కోసం ఎప్పుడూ లేదా చక్కెరను ఎప్పుడు ఉపయోగించకూడదు కేవలం అల్పాహారానికి ముందు ఉదయం అలాగే సాయంత్రం రోజుకు ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. మెంతికూర, నేరేడు పండ్లు కూడా మీరు మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల డయాబెటిస్ అదుపులో ఉంచుకోవచ్చు. శరీరానికి కావాల్సిన వ్యాయామం, నడక వంటివి తప్పనిసరి. కాబట్టి ఈ చిట్కాలు పాటించి మీరు డయాబెటిస్ కంట్రోల్ లో ఉంచుకోవచ్చు సుమా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: