ఓమిక్రానును తట్టుకోవాలంటే ఈ ఫుడ్డు తినండి.. ఇక ఇమ్యూనిటీ..!

MOHAN BABU
 కరోణ వైరస్ అనేది రకరకాల వేరియంట్లలో మానవునిపై దాడి చేస్తోంది. ప్రస్తుతం ఈ కొత్త వేరియంట్  ప్రపంచంలోని కొన్ని దేశాలలో  చాలా అలజడిని సృష్టిస్తుంది. దీంతో  ఇది ఎప్పుడు భారత్ కు వస్తుందని భారతదేశ జనాలు భయంతో చస్తున్నారు. మొన్నటి వరకు కరోణ  సెకండ్ వేవ్ వస్తేనే  భారతదేశం ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా కుదేలు అయిపోయింది. అయితే ఈ మధ్య మన పొరుగు దేశాల్లో వినిపిస్తున్న ఓమిక్రాన్ చాలా ప్రమాదకరంగా దాడి చేస్తోందని  ఇండియన్స్ భయపడు తున్నారు. దీన్ని రాకుండా మనందరం ముందుగానే కోవిద్ నియమాలను పాటించాలని అనుకుంటున్నారు. ఈ సందర్భంలోనే ఇన్ని రోజుల నుంచి కరోణ టీకాలు వేసుకోని వారంతా ఆరోగ్య కేంద్రాల వైపు పరుగులు తీస్తున్నారు. అయితే మన ఓమిక్రాన్ వచ్చిన తట్టుకోవాలంటే ప్రస్తుతం మన కున్నటువంటి  రోగ నిరోధక శక్తి సరిపోదు. ప్రతి ఒక్కరూ వారి యొక్క ఇమ్యూనిటీపై  దృష్టి పెట్టి ఎవరికి వారే రక్షించుకోవాలి.

 దీనికోసం ప్రతిరోజు  మనం ప్రోటీన్స్ కలిగిన ఫుడ్డు ఆహారంగా తీసుకోవాలి. ఇందులో ముఖ్యంగా స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ, బ్రోకోలి, వాల్ నట్స్, పాలక్, గ్రీన్ టీ వంటి  అనేక ప్రోటీన్ ఫుడ్స్ ఉన్నాయి. ముఖ్యంగా వీటిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండటం వలన మన ఇమ్యూనిటీ మెరుగుపడుతుంది. వీటికి తోడుగా తులసి మరియు అశ్వగంధ, అలవేరా వంటివి రోగనిరోధకశక్తిని పెంచడంలో ఎక్కువగా తోడ్పడతాయి. అలాగే మనం తినే ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు తింటే అన్ని విటమిన్స్ అందుతాయి.  ఇంకా మనం ఆరోగ్యంగా ఉండాలంటే నీరు అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. శరీరం  నిర్జలీకరణ అయినప్పుడు కదలిక మందగించిన అప్పుడు ఈ నీరు ఎంతో ఉపయోగపడుతుంది. దీనికి తోడుగా మనం ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వ్యాయామం చేస్తే ఎంతో ఆరోగ్యం మనకు ఉంటుంది.  అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరిగి ఓమిక్రాన్ లాంటి వాటి నుంచి బయటపడగలుగుతాం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: