కరోనా కొత్త పంజా.. పరిస్థితి ఏంటి..!

MOHAN BABU
కరోణ వైరస్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ప్రపంచాన్ని భయపెడుతోంది. కొత్త వేరియంట్ ఆఫ్రికా ఖండం బొట్సవానాలో బయట పడింది. ఈ వేరియంట్ దక్షిణాఫ్రికా, హాంకాంగ్, బెల్జియం, ఇజ్రాయెల్ కు సైతం విస్తరించింది. ఇది అత్యధిక వేగంతో వ్యాప్తి చెందే వేరియంట్  అని సమాచారం అందుతుండటంతో ఆసియా యూరప్ దేశాలు అప్రమత్తమయ్యాయి. నియంత్రణ చర్యలు ప్రారంభించాయి. కొత్త వేరియంట్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఆఫ్రికా ఖండం దక్షిణ ప్రాంతం నుంచి విమానయాన లపై నిషేదానికి 27 దేశాల్లో యూరోపియన్ యూనియన్ కూటమి అంగీకరించింది. ఓమిక్రాన్ వేరియంట్ తమ దేశం లోకి ప్రవేశిస్తే కష్టాలు తప్పవని జర్మనీ ఆరోగ్య శాఖ మంత్రి జెన్సెస్ పాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోణ సంబంధిత మరణాల సంఖ్య ఇప్పటికే 50 లక్షల మార్కును దాటేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాదకరమైన కొత్త వేరియంట్  పంజా విసిరితే భరించే శక్తి లేదని చాలా దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ ల ప్రభావాన్ని ఢీకొట్టే శక్తి కొత్త వేరియంట్ కు ఉందనే సమాచారం బెంబేలెత్తిస్తోంది.

మనిషి శరీరంలోని రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకునే సామర్థ్యం దీనికి ఉందని పరిశోధకులు అంటున్నారు. మలావి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుల్లో ఈ వేరియంట్ బయటపడిందని ఇజ్రాయిల్ దేశం వెల్లడించింది.అతనితో పాటు మరో ఇద్దరు అనుమానితులను ఐసోలేషన్ లో ఉంచామని తెలిపింది. ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను కూడా కుదిపేసింది. యూరప్, ఆసియాలో స్టాక్ మార్కెట్ లు భారీ నష్టాలను చవిచూశాయి. దక్షిణాఫ్రికాతో పాటు ఆఫ్రికా ఖండంలోని మరో ఐదు దేశాల నుంచి విమానాల రాకపోకలు నిషేధించింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఇది అమలులోకి వచ్చినట్లు పేర్కొంది. ఇటీవల కాలంలో ఆయా దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కరోణ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని ఆదేశించింది. దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో వెలుగు చూసిన కొవిడ్ కొత్త వేరియంట్ పై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. విదేశీ ప్రయాణికుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు పకడ్బందీగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. వారానికి కోవిడ్ పరీక్షలు ఖచ్చితంగా చేయాలని సూచించింది. ముఖ్యంగా దక్షిణ ఆఫ్రికా,హాంకాంగ్ నుంచి వచ్చే వారి పట్ల మరింత జాగ్రత్త గా వ్యవహరించాలని ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: