సైలెంట్ గా వచ్చి మనిషి ప్రాణాలు తీస్తున్న ఈ వ్యాధులు..!!

Divya

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారం, జీవనశైలి ,చుట్టుపక్కల పరిసరాలు ప్రభావితం చేస్తాయి.. అన్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే వ్యాధి అనేది ఎప్పుడు ఎలా వచ్చిందో తెలియదు.. కొన్ని కొన్ని సార్లు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ వ్యాధులను సైలెంట్ కిల్లర్ అని కూడా అంటూ ఉంటారు. అంతే కాదు ఏ విషయంలోనైనా సరే ఈ వ్యాధులు అకస్మాత్తుగా దాడి చేసి ప్రాణాలు తీస్తాయి అని ప్రజలు భయపడుతుంటారు.అంతే కాదు ప్రతి ఒక్కరికి ఈ వ్యాధుల గురించి ముందే అవగాహన ఉండి తీరాలి. అయితే ఆ సైలెంట్ కిల్లర్ వ్యాధులేంటో ఇప్పుడు మనం చూద్దాం..

1. మధుమేహం:
డయాబెటిస్ వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపించవు కానీ వచ్చిన తరువాత అలసట, బరువు కోల్పోవడం.. తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావడం.. వంటి సమస్యలు తలెత్తుతాయి. డయాబెటిస్ ముదిరిన తర్వాత గుండె సంబంధిత వ్యాధులు , కంటి చూపు కోల్పోవడం, మూత్రపిండాలు సరిగా పని చేయకపోవడం లాంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధ పడాల్సి వస్తుంది.

2.కరోనరీ ఆర్టరీ డిసీజ్
మనకు వచ్చే అత్యంత ప్రాణాపాయ గుండె జబ్బుల్లో ఇదీ ఒకటి. గుండెకు రక్తాన్ని,  ఆక్సిజన్ ను సరఫరా చేసే కరోనరీ ధమనులు కుచించుకుపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది . ఫలితంగా  ఛాతీనొప్పి, గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఈ సమస్య వచ్చిన తరువాత మనలో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఇక ఎంత చికిత్స పొందినప్పటికీ మనిషి ప్రాణాలకు ఎవరూ గ్యారెంటీ అయితే ఇవ్వలేదు.
3.అధిక రక్తపోటు:
హైబీపీ ఎంతో మందికి వచ్చే సమస్యే కానీ..ప్రాణాలు తీయగల ప్రమాదకారి. దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీసే అత్యంత ప్రమాదకరమైన ఆరోగ్యపరిస్థితులలో ఇదీ కూడా ఒకటి. పరిస్థితి ముదిరాకే లక్షణాలు కనిపిస్తాయి.
4.ఆస్టియోపొరోసిస్:
 ఆస్టియోపొరోసిస్ ను బోలు ఎముకల వ్యాధి అని పిలుస్తారు. ఈ వ్యాధి వచ్చినప్పటికీ మనకు లక్షణాలు త్వరగా బయటపడవు కానీ ఎముకల సాంద్రతపై దీని ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు ఎముకలు గుల్లగా మారిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: