అర్ధాకలితో మగ్గుతున్న బాల్యం.. ప్రభుత్వ బాధ్యత ఏది..?

MOHAN BABU
అర్ధాకలితో ఒక పూట కూడా సంతృప్తికరంగా భోజనం చేయలేని దౌర్భాగ్య కరమైన పరిస్థితుల్లో ఉన్న జనం ఒకవైపు తండ్లాడుతుంటే మరొకవైపు లక్షలాది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నా మిగతా సమాజం "అయ్యో" అని సానుభూతి కూడా చూపడం లేదు. ఇది చాలా బాధాకరం. గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో అనేక మంది చిన్నారులు కుటుంబ ఆసరా లేని కారణంగా తమ పోషణ కోసం భిక్షాటన చేస్తూ ఏది దొరికితే అది తింటున్న దౌర్భాగ్య స్థితిలో పోషకాహారం గురించి మాట్లాడడం అత్యాశే అవుతుంది. తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పటి నుండి జన్మించిన తర్వాత సంవత్సరం వరకు దాదాపుగా ప్రభుత్వ పర్యవేక్షణలో వైద్యం, పోషకాహారం పేరున ఇస్తున్నప్పటికీ అది సక్రమంగా సద్వినియోగం కావడం లేదు. మరొక వైపు పూర్తిగా మందుల పైనే ఆధారపడి నటువంటి నేటి జీవితం వలన తల్లి బిడ్డలు క్షేమంగా, బలంగా  ఉంటున్న దాఖలాలు కూడా లేకపోవడం విచారకరం. తెలంగాణ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రసూతి సమయంలో కెసిఆర్ కిట్ అనే పేరుతో ఇస్తున్నప్పటికీ తదనంతర కాలంలో పోషకాహారం అందక అనేక పేద కుటుంబాల పిల్లలు అనారోగ్యం, మృత్యువాత పడుతున్నారు. దీనికంతటికి కారణం పేదరికం ,ఉపాధి అవకాశాలు కుటుంబానికి లేకపోవడం, ఆదాయ మార్గాలు లేక విద్య వైద్యానికి తమ ఆదాయంలో అగ్ర భాగము ఖర్చు చేయవలసి రావడం వలన కూడా ఈ దుస్థితి ఏర్పడుతుంది.
    పోషకాహార లోపం డబ్ల్యూహెచ్వో  నిర్వచనం కొన్ని గణాంకాలు:-
     కనీసమైన జీవన చర్యలు జరిగే ఆస్కారం లేకుండా శారీరక వ్యవస్థ  చితికి పోయి ఉన్నప్పుడు అనారోగ్య లక్షణాలు చాలా కనబడుతూ ఉంటాయి. అప్పుడే మనం ఆరోగ్యం చెడిపోయింది అని అంటూ ఉంటాం." ఎత్తుకు తగిన బరువు లేకపోవడం, ముఖము పొట్ట తదితర భాగాలు వాపుతో ఉండటం ,కాళ్లు చేతులు సన్నబడటం వంటి లక్షణాలు ముఖము శరీరమంతా పేలి పోయినట్టుగా కనపడిన అటువంటి స్థితి ఆధారంగా తీవ్ర, మధ్యస్థ పౌష్టికాహార లోపాలను నిర్దేశిస్తారు. నిర్వచిస్తారు.."
    దేశవ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బంది నమోదు చేసిన సర్వే వివరాల ఆధారంగా ప్రభుత్వము పోషకాహార లోపంతో బాధపడుతున్న టువంటి చిన్నారుల గణాంకాలను విడుదల చేసింది. 2021 అక్టోబర్ 14వ తేదీ నాటికి భారతదేశంలో ఉన్న స్థితిగతులను ఈ నివేదిక స్పష్టం చేస్తున్నది.17.76 లక్షల మంది చిన్నారులు తీవ్ర పౌష్టికాహార లోపంతో,15.46 లక్షల మంది మధ్యస్థ పోషకాహార లోపంతో బాధ పడుతున్నట్లు గా అంచనా వేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం గా దేశం లో ఉన్నటువంటి చిన్నారుల సంఖ్య 46 కోట్లు ఉండగా ప్రస్తుతము 50 కోట్లకు చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతము దేశంలో 33 లక్షల మంది పోషకాహారలోపంతో అనేక రకాల బాధపడుతుండగా అందులో సగం మందిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉందని గణాంకాలు ప్రభుత్వాలను, సమాజాన్ని హెచ్చరిస్తున్నవి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: