ఈ కాయలు కనిపిస్తే అసలు వదలకండి..!

Divya
ప్రకృతిలో దొరికే ప్రతి మొక్క, ఫలం, వేరు ఇలా అన్నీ కూడా మనకు మంచి ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయని ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఆయుర్వేద నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే..అయితే వీటి వల్ల కలిగే ఫలితం నిదానమే అయినప్పటికీ తప్పకుండా శాశ్వతంగా నయం అవుతుంది అని చెప్పవచ్చు.. అలాంటి వాటిలో బుడమకాయ కూడా ఒకటి..మనం చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ బుడమ కాయ కనిపిస్తే చాలు నెత్తి మీద కొట్టుకుంటే టప్ టప్ అని శబ్దం వస్తూ.. భలే సరదాగా స్నేహితులతో ఆడుకున్న రోజులు గుర్తుకు వస్తాయి.
అయితే వీటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని మనకు అప్పట్లో అలాగే ఇప్పట్లో కూడా బహుశా చాలా మందికి తెలియదు ఏమో.. ఈ బుడమకాయ లు రుచికి కొంచెం పులుపు, తీపి కలిసి కొంచెం విచిత్రమైన రుచితో వుంటాయి.. ఇక ఈ కాయలు పైన సన్నటి పొర లాంటి కవచం ఒకటి ఉండి, లోపల చిన్నిచిన్ని పండ్లు పచ్చిగా కనిపిస్తాయి.. అయితే ఇవి బాగా పండినప్పుడు టమాటా రంగులో మనకు కనిపిస్తాయి.
ఇకపోతే వీటిని ఉపయోగించడం వల్ల చిన్న పిల్లల్లో వచ్చే నులిపురుగుల సమస్య  ఇట్టే తొలగిపోతుందట. అంతేకాదు మలబద్ధకం వంటి సమస్యలను కూడా ఈ బుడమ కాయ గింజలు దూరం చేస్తాయట. ముఖ్యంగా ఈ పండ్లను దసరా పండుగ రోజు అమ్మవారి దగ్గర పెట్టి మరి కొంతమంది తింటూ ఉంటారు.. ఇలా తినడం వల్ల వీరికి సకల రోగాలు దూరం అవుతాయని నమ్మకం.. ఎక్కువగా పొలాల గట్లపై చెట్లకు తీగలా అర్లుకు పోతూ ఉంటాయి.. కాబట్టి పొలం పనులు చేసేటప్పుడు గాయాలు తగిలి రక్తస్రావం అవుతూ ఉంటే , ఈ కాయలు నుంచి వచ్చే పసురును గాయాలపై పోస్తే రక్తస్రావం ఆగిపోతుంది. అంతేకాదు రోగనిరోధకశక్తి శక్తి పెరుగుతుంది. విటమిన్ ఏ ఉండడంవల్ల కంటికి సంబంధించిన సమస్యలు రావు.. మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవారు ఈ ఆకులను మెత్తగా నూరి నొప్పి ఉన్నచోట కట్టడంవల్ల మంచి ఉపశమనం కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: