చిన్నారులకు ఫైజర్ టీకా..అమెరికా కీలక నిర్ణయం !!

Surya
కరోనాతో అతలాకుతలం ఐన అమెరికా ప్రస్తుతం కరోనాను కట్టడి చేసే పనిలో పడింది. యుక్త వయస్కుల నుండి వృద్ధుల వరకు ఫైజర్ టీకాను  వేగవంతంగా అమలు జరిపారు. కరోనా కట్టడిలో ఫైజర్ అత్యంత ఉపయుక్తకరంగా ప్రధాన పాత్ర పోషించింది. అయితే ప్రస్తుతం వేచివున్న మూడవ ముప్పు కేవలం చిన్నారులపై అధికంగా ఉండడంతో అమెరికా ప్రభుత్వం కనీసం ఐదు సంవత్సరాలనుండి 11 సంవత్సరాల పిల్లలకు టీకా లు అందించాలని  నిర్ణయం తీసుకుంది. ఫైజర్ ను ఇచ్చేందుకు  అమెరికా అనుమతులు తీసుకుంది. దాదాపుగా 28 మిల్లియన్ చిన్నారులకు ఫైజర్ టీకాను అందించే పనిలో పడింది యుఎస్. అయితే ఉన్నత స్థాయి వైద్యబృందం సలహా సూచనలమేరకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. 


ఈమేరకు ఓ ప్రకటన కూడా వెలువరించింది. టీకా తీసుకుంటే వచ్చే దుష్ప్రభావాలకంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సందర్భంగా ఓ లేడీ డాక్టర్... ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్ చీఫ్ జానెట్ వుడ్‌కాక్ మాట్లాడుతూ " ఇప్పటికే ఈ టీకా తీసుకోవడానికి చిన్నారులు తల్లి తండ్రులు , టీచర్లు , సంరక్షకులు  మరియు చిన్నారులనుండి అనుమతి కోసం ఎదురు చూస్తోంది. ఒక తల్లిగా మరియు వైద్యురాలిగా నాకు ఈ విషయం తెలుసు. టీకా తీసుకోవడం వల్ల మనం సాధారణ పరిస్థితులకు తిరిగి వెళ్లే అవకాశం ఉంటుంది . " అని వెల్లడించారు . ఇప్పటికే చిన్నారులకు చైనా, యునైటెడ్ అరబ్ స్టేట్స్, క్యూబా, చీలి వంటి దేశాలలో విజయవంతంగా టీకా అందిస్తున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం అమెరికా 5 కోట్ల కోవిడ్ డోసులను రెడీ గా ఉంచింది అని ఫైజర్ సంస్థ వెల్లడించింది.



 అయితే చిన్నారులపై క్లినికల్ ట్రయల్స్ జరిగాయి .
 దాదాపుగా ఈ వ్యాక్సిన్ ను రెండువేల మంది చిన్నారులపై ప్రయోగించగా 90% సమర్థవంతంగా పనిచేసినట్లు వెల్లడయ్యింది , అదేవిదంగా వ్యాక్సిన్ సేఫ్టీ గురించి దాదాపు గా మూడువేల మంది పై క్లినికల్  ట్రయల్ జరుగగా ఎటువంటి సైడ్ ఎఫక్ట్స్ లేవని నిర్ధారించినట్లు అధికారులు తెలియజేసారు. అయితే పిల్లల్లో మాత్రం యుక్తవయస్కుల్లో కనబడే తీవ్ర కోవిడ్ లక్షణాలు ఉండవని తెలిపారు. కరోనా సమయంలో నమోదైన కేసుల్లో 8300 మంది చిన్నారుల్లో  5 సంవత్సరంనుండి 11 సంవత్సరాల వారే. దాదాపు 146 మంది చిన్నరులు మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: