గుడ్ న్యూస్: విదేశీ ప్రయాణం చేయాలనుకున్న వారికి అమెరికా..!

MOHAN BABU
అమెరికా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. టీకా తీసుకున్న వారిని తమ దేశంలోకి అనుమతించేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే నవంబర్ 8 నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రానుంది. అమెరికా ప్రభుత్వం ఇతర దేశాలకు ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది. కరోనా ఆంక్షల  విషయంలో సడలింపులకు పూనుకుంది. వ్యాక్సిన్ తీసుకున్న విదేశీయులు తమ దేశంలోకి అడుగుపెట్టేందుకు అంగీకరించింది. అయితే నవంబర్ 8 నుంచి  ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. టీకా తీసుకున్న వారిని త్వరలో తమ దేశంలోకి అనుమతిస్తామని బైడెన్ ప్రభుత్వం సెప్టెంబర్ లోనే  ప్రకటించింది. ఆ మాటకు కట్టుబడి నవంబర్ 8 నుంచి ఆ నిర్ణయాన్ని అమల్లోకి తెస్తుంది అమెరికా ప్రభుత్వం. కరోణ కేసులు విజృంభిస్తుండడంతో  అమెరికా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. అందులో భాగంగానే ఇప్పటివరకు ఇతర దేశాల నుంచి వస్తున్న వారిని తమ దేశంలోకి అనుమతించలేదు. ఐరోపా, బ్రెజిల్, భారత్,చైనా,అమెరికా చాలా స్ట్రిట్గా వ్యవహరించింది.

కొత్త నిబంధనల ప్రకారం కరోనా టీకా తీసుకున్నవారు విమాన ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్టిపిసిఆర్ పరీక్ష  చేయించుకోవాల్సి ఉంటుంది. అందులో నెగిటివ్గా తేలితే అమెరికా ఫ్లైట్ ఎక్కవచ్చు. ఈ క్రమంలో వారు కాంటాక్ట్ ట్రేసింగ్ వివరాలను అధికారులకు ఇచ్చేందుకు అంగీకరించాల్సి ఉంటుంది. ఇక టీకా తీసుకుని వారికి గతంలో మాదిరిగానే అమెరికాలో ప్రవేశించేందుకు అర్హత  ఉండదు. వ్యాక్సిన్ తీసుకుని అమెరికా జాతీయులు ముందుగా కరోణ పరీక్ష చేయించుకుని నెగిటివ్ రిపోర్ట్ వస్తేనే అధికారులు ప్రయాణానికి అనుమతిస్తారు.

ఎఫ్డిఏ గుర్తింపు పొందిన వ్యాక్సిన్ తోపాటు డబ్ల్యూహెచ్వో నుంచి అత్యవసర అనుమతి పొందిన టీకాలను కూడా అమెరికా ప్రభుత్వం గుర్తిస్తుంది. దీంతో చైనా సంస్థ సైనో ఫార్మ్, ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన టీకా తీసుకున్న వారికి అమెరికాకు వెళ్లేందుకు అనుమతి లభించినట్లయింది. అయితే రెండు డోసుల్లో వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకున్న వారి పరిస్థితి ఏంటనే దానిపై స్పష్టత ఇవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: