బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే.. ఆ సమస్యలు ?

Veldandi Saikiran
మన నిత్య జీవితంలో ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. మనం సరైన ఆహారం తీసుకోకపోతే... మనకు అనారోగ్య సమస్యలు వస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఆహారం.. తో పాటు మనం ఉదయం పూట అల్పాహారాన్ని తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం మోతాదులో ఆహారం మరియు రాత్రి సమయంలో ఇంకా తక్కువగా ఆహారం తీసుకుంటే మన జీవన వ్యవస్థ సజావుగా సాగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే మధ్యాహ్నం మరియు రాత్రి సమయాల్లో భోజనం చేయకపోయినా సరే కానీ ఉదయం పూట అల్పాహారం ఖచ్చితంగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. 

ఉదయం పూట టిఫిన్ చేయకపోతే అనేక అర్థాలు వస్తాయని చెబుతున్నారు వైద్యనిపుణులు. పని బిజీలో పడి చాలామంది టిఫిన్ చేయకుండానే తమ పనులకు వెళ్లిపోతారు. అయితే మనం టిఫిన్ చేయకపోతే అనేక సమస్యలు వస్తాయని.. అయితే వాటిని ఎలా ఎదుర్కోవాలో... కొన్ని టిప్స్ కూడా మనకు ఉన్నాయి.  అవేంటో ఇప్పుడు చూద్దాం. మనం ఉదయం పూట టిఫిన్ చేయకపోతే మహిళల్లో ఎక్కువగా... టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు వైద్యనిపుణులు. 

అలాగే ఆలస్యంగా టిఫిన్ చేసినా కూడా తలనొప్పి మరియు మైగ్రేన్ లాంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు వైద్యనిపుణులు. ఇక ముఖ్యంగా అల్పాహారం మనం తీసుకోకపోతే క్యాన్సర్ లాంటి సమస్యలు వస్తాయని కూడా కొందరు వైద్యులు చెబుతున్నారు. ఉదయం పూట టిఫిన్ చేయకపోతే యువతలో ఏకాగ్రత ఏకాగ్రత సమస్య తలెత్తుతుందని చెబుతున్నారు. అంతేకాదు బట్టతల మరియు బరువు పెరిగి పోవడం లాంటి సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఉదయం పూట టిఫిన్ చేయాలి. ప్రతిరోజు ఉదయం పూట టిఫిన్ చేసి... అనేక అనారోగ్య సమస్యల నుంచి ముందే బయటపడండి. తద్వారా ఆస్పత్రి ఖర్చులు తగ్గి మన ఆరోగ్యం చాలా బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: