చేత్తో తిన్న ఎక్సర్ సైజు అవుతుందా..! ఎలా..?

MOHAN BABU
చేత్తో తింటేనే అది మైండ్ ఫుడ్ ఈటింగ్ అవుతుంది. మనం తినే ఆహారంపై కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎంత తింటున్నామనేది కూడా లెక్క ఉంటుంది. పైగా కాస్త మెల్లిగా కూడా తింటాం. దీనివల్ల  కొంచెం తిన్న  కడుపు నిండిన ఫీలింగు వస్తుంది. అదేవిధంగా స్పూన్ తో తింటే మాత్రం ఎంత తిన్నా తిన్నట్టు అనిపించదు. ఎంతటి రుచి వంటకమైన  తిన్న సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. దింతో మనం తినే క్వాంటిటీ కూడా ఎక్కువై, బరువు పెరుగుతారు. మనం చేత్తో తినడం వల్ల టైప్- 2 అనే డయాబెటిస్ నుంచి తప్పించుకోవచ్చు. ఎలాగంటే చాలా మంది కుదురుగా కూర్చొని  తినటానికి  టైం లేక స్పూన్ తో స్పీడ్ గా  తింటుంటారు. దీని వల్ల మనకు బ్లడ్, మరియు  షుగర్ లెవల్స్ లో తేడా వచ్చి టైప్- 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. టైప్-2 డయాబెటిస్ తో  బాధపడేటువంటి వాళ్లలో ఎక్కువమంది స్పూన్ తో తినే అలవాటు  ఉన్నవాళ్లే అని చాలా స్టడీలో తేలింది. చేత్తో తినడం వలన అరుగుదల సమస్యలు అనేవి కూడా రావు.

అన్నం మరియు ఇతర ఫుడ్ ఐటమ్స్ చేతితో తీసుకున్నప్పుడు  తినడానికి రెడీ అవుతున్నామని  బ్రెయిన్ పొట్టకు సిగ్నల్ ను పంపిస్తుంది. దీనివల్ల తిన్న ఫుడ్ త్వరగా అరిగిపోతుందని చెప్పవచ్చు. కానీ స్పూన్ తో తినడమనేది మెదడు నుంచి పొట్టకి ఆ సిగ్నల్స్ వెళ్ళవు. చేతివేళ్ళపై నార్మల్ ఫ్లోరా అనేటువంటి  బ్యాక్టీరియా ఉంటుంది. దీని ద్వారా మన ఆరోగ్యానికి ఎలాంటి నష్టం కూడా ఉండదు. అలాగే బయటి నుంచి శరీరంలోకి వచ్చేటువంటి హానికరమైన బ్యాక్టీరియా లను కూడా అడ్డుకుంటుంది. అందుకే ఈ బ్యాక్టీరియానీ   గొంతు, నోరు  డైజేషన్ ట్రాక్, చిన్న పేగులలో అభివృద్ధి  చేసుకోవడం అనేది చాలా అవసరం. అందుకు ఏవో ప్రయత్నాలు చేయనక్కర లేదు. చాలా సింపుల్ గా చేతితో  అన్నం తింటే చాలు.

స్పూన్, మరియు ఫోర్క్ తో తినడం వలన ఆహారం  టెంపరేచర్ తెలియదు. కానీ చేతితో తినడం వలన  ఫుడ్ చల్లగా ఉన్నా, ఎక్కువ వేడిగా ఉన్నా వెంటనే తెలిసి పోతుంది. చేతితో పట్టుకోవడం వల్ల ఆహారం యొక్క  క్వాలిటీ, పరిశుభ్రత  కూడా తెలుస్తాయి. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్  నుండి మనం తప్పించుకోవచ్చు. చేతితో తినడం వలన కూడా ఒక ఎక్సర్ సైజు కూడా అవుతుంది. చేతితో కలిపి ఆహారం  తినడం వల్ల కండరాలు కూడా బలంగా  బలపడతాయి. దాని వల్ల రక్తం  సరఫరా  పెరిగి బాడీ ఫిట్ గా ఉంటుంది. ఈ యొక్క  లాభాలన్నీ కావాలంటే మనం  చేతుల్ని శుభ్రంగా చేసుకొని  తినాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: