వానాకాలంలో ఇవి పాటించకపోతే ప్రమాదమే..

Purushottham Vinay
ఇక వానా కాలం అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆహ్లాదకరంగా వున్నా కాని జాగ్రత్తలు పాటించకపోతే పలు రోగాలు అనేవి వస్తుంటాయి. ఇక ఈ వానా కాలంలో తరచూ వర్షాలు పడటం వల్ల అనేక నీటి నిల్వలు ఏర్పడతాయి. అలాంటప్పుడు తాగునీరు బాగా కలుషితమై.. అనేక వ్యాధులు అనేవి సోకడానికి కారణమవుతాయి. అందువల్ల పిల్లలు కాని పెద్దలు వేడి చేసి వడబోసిన నీటిని మాత్రమే తాగుతూ ఉండాలి.ఇక ఈ సీజన్‌లో ఎప్పటికప్పుడు కూడా కేవలం వేడి ఆహారాన్ని మాత్రమే తినాలి. తినే ఫుడ్‌ను ఫ్రిజ్‌లో  నిల్వ ఉంచుకుని తినడం అస్సలు మంచిది కాదు. అలాగే రాత్రి పూట నిల్వ ఉంచిన ఫుడ్‌ను కూడా అస్సలు తీసుకోకూడదు.అలాగే ఆకుకూరాలు ఇంకా కూరగాయలపై మట్టి, గుడ్డు ఇంకా లార్వా అనేది కూడా ఎక్కువగా నిల్వ ఉంటుంది. అందుకే వండుకునే ముందు ఉప్పునీటిలో 5 నిమిషాలు నానపెట్టిన తర్వాతనే వండుకోవడం చాలా మంచిది.ఇక ఈ వానా కాలంలో వర్షం పడ్డ నీటిలో నడవటం మంచిది కాదు. ఒకవేళ వానలో మీ పాదాలు తడిచినట్టయితే.. వెంటనే మంచినీటితో కడుక్కోవడం ఖచ్చితంగా చాలా ముఖ్యం. అలాగే తడిలేకుండా పూర్తిగా తుడిచి కసేపు ఆరనివ్వాలి.

నిద్రపోయే ముందు కూడా పాదాలకు ఆల్మండ్‌ లేదా కొబ్బరి నూనెను రాసుకోవటం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల పాదాలకు ఇంకా గోళ్లకు ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌ అనేవి అసలు రాకుండా ఉంటాయి. ఇలా చెయ్యకపోతే డయాబెటీస్‌ ఉన్నవారికి ఇన్ఫెక్షన్‌ అనేది చాలా త్వరగా సోకుతుంది.వర్షా కాలంలో ప్రతిరోజూ ఉదయమే ఇంటిని బాగా తుడవాలి. వర్షాకాలంలో ఇంట్లోకి ఇన్ఫెక్షన్‌ వ్యాపింపజేసే క్రిములు అనేవి ఎక్కువగా వచ్చేస్తాయి. అందుకే యాంటీ సెప్టిక్‌ సోల్యూషన్స్‌ కలిపి మాప్‌ కొట్టుకోవడం మంచిది. అలాగే ఖచ్చితంగా బట్టల్లో కూడా ఉపయోగించాలి.ఒకవేళ మీ ఇంట్లో చిన్న పిల్లలు కనుక ఉంటే బేసిక్‌ మెడిసిన్స్‌ను ఖచ్చితంగా అందుబాటులో పెట్టుకోవాలి. వారికి ఫుడ్‌ తినేముందు ఇంకా తిన్న తర్వాత జాగ్రత్తగా ఉండాలి.బాత్ రూమ్ కి వేళ్లి వచ్చిన తర్వాత చేతులను ఏదైనా శానిటైజర్లతో శుభ్రంగా కడుక్కోవడం చాలా అవసరం. ఇంకా అలాగే బట్టలు ఏమాత్రం తడిగా ఉన్నా కాని ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌ వచ్చే ప్రమాదం చాలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: