డైట్ లో ఇవి తీసుకుంటే బరువు ఈజీగా తగ్గొచ్చు..

Purushottham Vinay
బరువుని తగ్గించే వాటిల్లో గ్రీన్ టీ చాలా ప్రధానమైనదని ఇంకా ఎంతో ముఖ్యమైనది. ఇక గ్రీన్ టీ లో కేటీచిన్ అనే ఎంతో ఆరోగ్యకరమైన సమ్మేళనాలు అనేవి ఉన్నాయి. ఇవి బరువుని తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి. ఇక అంతేకాదు ఇది జీవక్రియలను కూడా బాగా మెరుగు పరుస్తుంది. అలాగే క్యాన్సర్‌తో పోరాడే తత్వాన్ని కూడా గ్రీన్ టీ కలిగి ఉంది. ఇక ఆరోగ్యకరమైన ఈ గ్రీన్ టీ రెండు రకాలు.. ఒకటి గ్రీన్ టీ-కెఫిన్ ఇంకోటి నాన్-కెఫిన్ ప్రేరిత గ్రీన్ టీ.  ఎవరైనా సరే విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో శరీరంలోని కేలరీలను బర్న్ చేయడంలో గ్రీన్ టీ ఎంతగానో సహాయపడుతుంది.ఇక గ్రీన్ టీ తర్వాత.. బరువు తగ్గించేందుకు ఎక్కువగా బ్లాక్ టీ తాగడం చాలా మంచిది. బ్లాక్ టీ ఇంకా గ్రీన్ టీ రెండూ కూడా బరువు తగ్గించడంలో ఎంతగానో సహాయపడతాయి.

అలాగే బ్లాక్ టీ రక్తపోటుని బాగా అదుపులో ఉంచుతుంది.ఎక్కువ కొవ్వు ఉన్న భోజనం తింటే బ్లాక్ టీ ఆ కొవ్వుని చాలా ఈజీగా కరిగిస్తుంది.అలాగే కూరగాయల రసంలో ఫైబర్ కూడా ఎంతో పుష్కలంగా ఉంటుంది. ఇక అలాగే నిద్రపోతున్నప్పుడు లేదా క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారికి కొవ్వు తగ్గించడంలో ఇది ఎంతగానో పాత్ర పోషిస్తుంది. దుంపలు, క్యారెట్లు, టమోటాలు ఇంకా ఆకుకూరలు వంటి కూరగాయలు ఖనిజాలు ఇంకా విటమిన్లను అందిస్తాయి. ఇక అంతేకాదు హైడ్రేషన్ స్థాయిని కూడా అదుపులో ఉంచడంలో ఎంతగానో సహాయపడతాయి.ఇక బ్లూ బెర్రీస్ అనేవి ఎక్కువ శాతం 85% నీటిని కలిగి ఉన్నాయి.  అంతేకాదు కార్బోహైడ్రేట్లు ఇంకా ఫైబర్ లతో పాటుగా విటమిన్  సి , కె లు కూడా బ్లూబెర్రీలో చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇందులో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఇక అవి శరీరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ స్థాయిని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అందుకే రక్తపోటు ఇంకా డయాబెటిక్ సమస్యలతో బాధపడుతున్నవారికి బ్లూబెర్రీలు మంచిగా సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: