ఈ చిట్కాలతో బరువు సింపుల్ గా తగ్గవచ్చు !

Veldandi Saikiran
ప్రస్తుత కాలంలో అధిక బరువుతో చాలా మంది అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నారు. బరువు ఎలా తగ్గాలి అనే దానిపైనే కసరత్తు చేస్తున్నారు కొంతమంది. కొంతమంది సక్సెస్ అవుతుంటే మరికొంత మంది విఫలమవుతున్నారు. ఇక మరి కొంత మంది అయితే డాక్టర్ల దగ్గరికి వెళ్లి వేలకు వేలు ఖర్చు చేసేస్తున్నారు. అయితే... పైసా ఖర్చు లేకుండా మన ఇంటి వద్ద... కొన్ని నియమ నిబంధనలు పాటిస్తే... బరువు సులభంగా తగ్గవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
గ్రీన్ టీ తో నిమ్మ, పుదీనా : గ్రీన్ టీ తాగడం ద్వారా... మనం అతి త్వరగా బరువు తగ్గవచ్చు.  అయితే  ఈ ప్రక్రియ మరింత.. సమర్థవంతంగా పని చేయాలంటే గ్రీన్ లో పుదీనా మరియు నిమ్మ కలుపుకోవాలి.
నిమ్మ మరియు ఫైనాపిల్ : నిమ్మ మరియు పైనాపిల్ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా పైనాపిల్ లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ పైనాపిల్ తినడం వల్ల ఎక్కువ శాతం మన శరీరానికి నీరు అందుతోంది. దీనివల్ల పదార్థాలు తగ్గిపోతాయి. అలాగే ఫైబర్ కూడా విరివిగా మనకి లభిస్తుంది. ఇక పైనాపిల్ రసం తో పాటు నిమ్మరసం కలుపుకొని తాగితే మన శరీరంలో ఉన్నటువంటి కొవ్వు కరిగిపోతుంది. తదనంతరం మనం బరువు తగ్గిపోతాo.
గుడ్డు మరియు క్యాప్సికం :  మన నిత్య జీవితంలో గుడ్డు అనేది కీలకం. ఈ గుడ్లలో ప్రోటీన్ చాలా సమృద్ధిగా లభిస్తుంది. అలాగే గుడ్డుతో పాటు క్యాప్సికం కలిపి మనం తింటే సులభంగా బరువు తగ్గిపోవచ్చు. ఇక ఈ గుడ్లలో యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్ లభిస్తాయి. ఇక క్యాప్సికం లో  విటమిన్-సి బాగా లభిస్తుంది. అయితే క్యాప్సికమ్ మరియు గుడ్డు కలిపి తీసుకుంటే మనం త్వరగా బరువు తగ్గించుకోవచ్చు. మనకు ఈ డైట్ చాలా ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: