కళ్లద్దాలు రాకుండా ఉండాలంటే ఇవి తినాల్సిందే !

Vimalatha
గత కొన్ని సంవత్సరాలుగా మారుతున్న తరాలతో పాటు ఆరోగ్యం కూడా దిగజారిపోతోంది. ముఖ్యంగా మానవ జీవిత కాలంలో కళ్ల ఆరోగ్యం వేగంగా క్షీణించింది. ఇంతకుముందు ముందు కేవలం 10-15 మంది మాత్రమే సాధారణంగా వృద్ధుల కళ్లపై అద్దాలతో కనిపించేవారు. కానీ గత కొన్నేళ్లుగా కళ్ళు బలహీనపడే వయస్సు చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతం10-12 సంవత్సరాల పిల్లల కళ్లకు కూడా కంటి అద్దాలు రావడం ఆందోళన కలిగించే విషయం.
అనారోగ్యకరమైన కళ్ళు కాంతిని బలహీనపరచడమే కాకుండా, కంటి శుక్లం వంటి సమస్యలను కూడా కలిగిస్తాయి. కంటి సంరక్షణ చాలా ముఖ్యం. దీని కోసం మీరు కంటికి మేలు చేసే పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. కళ్ళ ఆరోగ్యానికి మంచి చేసే ఆహారం గురించి  తెలుసుకుందాం.
విటమిన్లు A, C, E ఉన్న ఆహారాలు :
అమెరికన్ ఆప్టోమెట్రిక్ అసోసియేషన్ ప్రకారం విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు కంటి శుక్లం వంటి వ్యాధుల నుండి కళ్ళను రక్షించడంలో సహాయ పడతాయి. అందువల్ల మీరు ఆహారంలో గింజలు, సిట్రస్ పండ్లు, చేపలు, విత్తనాలను ఉండేలా చూడాలి.
కళ్లకు ముఖ్య ఆహరం నీరు
శరీరంలో నీరు లేకపోవడం అంటే డీహైడ్రేషన్. అది కళ్లపై చెడు ప్రభావం చూపుతుందని చాలా మంది నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా కళ్ల కండరాలు బలహీనపడటం, కంటి చూపు తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల మీరు రోజూ తగినంత నీరు తాగుతుండాలి.
ఆకుపచ్చ ఆకు కూరలు
ఆకుపచ్చ ఆకు కూరలు విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. ఇవి కళ్ళకు మాత్రమే కాకుండా మొత్తం శరీర ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ ప్రకారం ఆకుకూరలలో బీటా కెరోటిన్, విటమిన్లు, లుటిన్, జియాక్సంతిన్ ఉన్నాయి. ఇవి హానికరమైన కిరణాలు, రేడియేషన్ నుండి కళ్ళను రక్షించడంలో సహాయపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: